పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము 215

లన్నిటిని మీకు వదలివేయుచున్నాను; నాకే పనివచ్చిన యెడల నొక్క వాక్యమయిన నాకుక్షిలోనుండి పైకి రానిత్తునా? 'యని సమ యేచితముగా బ్రత్యుత్తరము నిచ్చి, యిక నందు నిలుచుట కార్యము కాదనుకొని శిఘ్రముగా మాగ్రామము వదలివేసి దేశాంతరమునకు ఁ బోవలెనని బయలు దేఱితిని .ఆట్లుబయలుదేఱి గ్రామైకరాత్రముగా శయనించుచు భోజనముచేసినయూకఁ బరుం డక నిత్య ప్రయాణములు చేయుచు,ఒకనాఁ డొకగ్రామముపఱగడ గొప్పమేఁకలమంద నొకదానిని జూచి ఇన్నిమేడలను వాఁడెట్లు కాపాడఁగలడాయని గొల్లవానియందు మిక్కీలి కనికరము తోఁచి కొంతభారము తగ్గించినను తగ్గించుటయే యని రెండు మేఁకపిల్లలను ఋజముమీఁద వ్రేసికొని నడవనారంభించితిని;అప్పుడు వాని వెంటనే తల్లియు నఱచుచు రాసాగెను;అదిచూచి తల్లిబిడ్డల నెడఁబాసిన పాపము వచ్చునని కొంతభూతదయ గలవాఁడనై యాపిల్లల తల్లినిగూడ ధోలుకొని పోవుచుంటిని.ఆ సంగతి నేలాగుననో కనిపెట్టిగొల్లవాఁడు నా వెనుక 'దొంగా!ఆగూ'మని కేకలువేయుచు నడచివచ్చుచుండెను. ఆదివరకును పయిగ్రామము నెంతప్రొద్దెక్కి చేరుదునోయని భయ పడుచుంటిని గాని,వానికేకలతో నిమిషములో నూరుచెరి సంతో షించి తిరిగిచూచితిని;వాడు నాపరుగు కలిసికోలేక తక్కినమేఁకల నెవ్వరెత్తుకొని పోదురో యని యప్పుడే వెనుక మరలిపోయెను.నేనా మేఁకనుపిల్లలను పోరుగూరులోవక్రయించి యాసొమ్ము దారిబతై మున కుంచుకొని,కొన్నిదినములలో కొండవీడుచేరి యచటయేగినై యుండి,నాయెద్ద సీతారామయంత్ర మున్నదనియు దానిని జూచిన వానికి సమస్త సంపదలు గలుగననియుఁజెప్పి,యొకబొమ్మరాతిని గదిలోనుంచి రహస్యముగా డబ్బుడబ్బు చొప్పునఁఋచ్చుకొని చూప