పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216 రాజశేఖర చరిత్రము


నారంభించితిని. ఏపాడువస్తువు నయిననునరే రహస్యముగా నుంచుట వలన దానియందు గౌరవము హెచ్చును. దివ్యక్షేత్రములయందలి దేవాలయములలోని విగ్రహములను పామరులు పూజారులకు దక్షణ లిచ్చి స్వామి యెంత బాగుండునో యని చూచులాగుననే యెల్లవా రును నాకును కానుకలను సమర్పించి యాబొమ్మరాతిని మూఁకలుగా వచ్చి జనులుచూచి పోవుచుండిరి; చూచినతరువాత చేతకాని పని వాని చేతఁ జెక్కఁబడిన యాకురూపముగల విగ్రహములందువలెనే యారాతియందును వీధిలోఁగనఁబడెడి బొమ్మరాయియేయని యెల్ల వారికిని సనాదరము కలుగనారంభించెను.నిజముగా నేను సీతారామ యంత్రమని లోపలఁబెట్టిచూపిన శిలను ఒకదినమున వీధిలో ఁబెట్టి చూపినచో మఱునాడెవ్వరును దాని మొగమువంకనైనఁ జూడఁ గోరరు. నేనాప్రకారముగా యేగినిగా నున్న కాలములో ప్రయేగ విద్యయందును భూతవైద్యమునందును మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాఁడను

కాఁబట్టి నామహత్వము నల్లవారును చెప్పుకొనుచుందురు.నేను వద

లింపఁబూనుకొన్నదయ్యముల కధలనుబలె నాకధలనుసహితమెల్ల వారును సత్యాదరులై వినుచువచ్చిరి కాని యినియువానివలెనే విను వారిభయమును మఱింత వృద్ధి పఱుచుటకే వినియేగపడుచు వచ్చి నందున, గ్రామములో నందరు నే నేమిప్రయేగము చేసిపోదు నేమో యని నాకు జడియుచుండిరి.


పయిమిషచేత ధన మార్జించి యాగ్రామములో సుఖజీవనము చేయుచుండఁగా నన్ను వ్యాధి యాశ్రయించినందున, నే నదివర కెందఱో మరణమున బ్రహ్మైక్యమే కాఁబట్టి సంతోషింపవలయు నని బోధించువచ్చినను చచ్చిపోదునని భయపడఁజొచ్చితిని.మీరే యేగిని బిలిచి మీకు మరణ మన్నభయ మేమైనఁ గలదా యని