పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

213:పదునాల్గవ ప్రకరణము చూచుకొనుటకును నన్నడ బఱిచి పంపెను .మాకు వచ్చిన లాభము స్వల్పమే యైనను పనిచేయువాఁడను గనుక నాకెక్కువ లాభము కావలెనని నేను నా మిత్రునితో కలహము పెట్టుకొన జొచ్చితిని.రాజు లనుభవించుటకు రాజ్యములున్నను,ఒకరితో నొకరు పొట్లడిచత్తురు;సన్యాసులకు క్ౌపీనము క్ంటె నధిక మేమియు లేకపోనను పోరులేక సంతుష్టీ పొంది యుందురు. దైవము దయచేసినదానితోఁదృప్తి పొందియున్న నేకలహములును గలుగవు.తృప్తిలేక యాశా పిశాచముచే నావహింపఁబడిన చో నేల్ల కలహములును గలుగును.అయినను నా స్నేహితుఁడు మిక్కిలి మంచివాఁడును ఉదారసాహసము కలవాఁడును గనుక,ఒకనాఁడు నన్ను తనదగ్గఱకుఁబిలిచి యిట్లనియెను.

       నీవు మొదటినుండియు వర్తకుఁడవుగా నున్నావు గనుక

నీకుసొమ్మునందే యిష్టము;నాకు విద్యాధనమునందు మాత్ర మిష్టము.త్యాగబోగముల కక్కఱకు రాకపోయినను ధనమునుజూచు కొనుచున్నను నీకు సంతోషము కలుగును.నాకు ;గౌరవముతో జరగుట కున్నంజాలును.కాఁబట్టి యీ రెండవందల రూపాయలను నీవు పుచ్చుకొమ్ము.

      అనియాతఁడు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచిపెట్టెను.

ఆసొమ్ము చేతికందిన సంతోషముచేత,మఱింత యుల్లాసముతో దుకాణము కట్టిపెట్ట్టి రాత్రియు పగలునుకూడ జూదమాడసాగించి కొన్నిమాసములలో సొమ్ముంతయుఁ బోఁగొట్టుకొని జోగినైతిని.తరు వాత పసశ్చాత్తాపపడి,తిండికిసహితమూ జరగక యిబ్బందిపడుచు నొక నాఁడు మాసికలువేసిన బట్టలతో స్నేహితునియొద్దకుఁబోయి యాతఁడు చేసిన యుపకారమును బహువిధములఁ గొనియాడి నాకుమ్