పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212 ;రాజశేఖర చరిత్రము చుండెను;ఆఁతడు చదువునందు మిక్కిలి యాశక్తికలవాడు;ఆతనిలో నేను మైత్రిచేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెలఁగుచుంటిని. కొందరు నమ్మకమిచ్చినప్పుడు మనసుకుడనిచ్చి యూరకుందురు; నేను తెలివిగలవవాఁడను గనక ఆలాగున జేయక వేయినమ్మకము లిచ్చినను మనసుమాత్ర మియ్యక దాఁచుకొంటిని.ఈప్రకారముగా నుఁడి యతనిని పలువిధముల మోసముచేసి ధనమార్జించు చుంటిని. ఆది యేమి మాయయేకాని నేనెన్నివిధముల మోసముచేసి ధనము సంపాదించుకొనుచున్నను బీఁదవాఁడనుగాను,అతడు ధనవంతుఁడు గాను ఉంటిమి. అతఁడు విద్యయందు వృద్ద్ధిపొందినకొలఁది,నేను ద్యూతవిద్యయందు పాండిత్యమును పొందనారంభించితిని.చెడుపిల్ల వాండ్రతోడి సాంగత్యమువలనఁ జదువు మానివేసి డబ్బుపెట్టి జూద మాడమొదలుపెట్టి యావ్యసనములోఁబడి యింటఁగల వస్తువులను దొంగతనముగాను బలవంతముగాను దిసీకొనిపోయి జూదగాండ్రకు సమర్పించుచుందును.ఇట్లుండియు మాపొరుగు చిన్నవానితోడి చెలి మిని మాత్రము మానలేదు. ఆతనిపేరు భాస్కరుడు, నాపేరు పద్మనాభుఁడు.ఇట్లు జరుగుచుండగా నాకు పదియాఱుసంవత్సరములు దాఁటినవి; నామిత్రుడు పెద్దవాడై గృహ యాజమాన్యమును వహించి విద్యాభిరుచి గలవాఁడై సదాపండితులగోష్టిని ప్రొద్దుపుచ్చు చుండెను.నేనొకనాఁ డితనియొద్దకు బోయి నాస్థితిగతులను జెప్పు కొని నాతండ్రియు వర్తకుఁడే గనుక నాకు వ్యాపారము చేయ నిష్టముకలదనియు మూలధనము క్రింద నేమైనఁబెట్టుబడిబెట్టీ సాయము చేయవలసినదనియు కోరితిని.ఆతఁడు తానుగూడ పాలికుండెదనని చెప్పి రెండువందల రూపాయలను నాచేతకిచ్చి నేను పనిచేయుటకును తాను వడ్డి పుచ్చుకొనకుండుటకును వచ్చిన లాభముతో చెఱిసగము