బలముమాత్రముచేరినదికాదు. గ్రామములో విరోధమంతకంతకు ప్రబలినది. తెల్లవార లేచి చూచువఱకు, మావీధిగుమ్మమునిండ నశుద్ధపదార్ధములును మనుష్యులపుఱ్ఱెలును పడియుండుచు వచ్చెను. మా తండ్రి వానినన్నిటినిదీసివేసి నిత్యమును రెండుమూడు స్నానములు చేయుచు భార్య కుపచారము తిన్నగా జరగనందున నన్నామెవెంట నిచ్చినవారిమీఁద పుట్టినింటికి హేలాపురము పంపి, తానొక్కఁడు నిల్లు కనిపెట్టుకొని యుండెను.
బయలుదేఱిన మఱునాడురాత్రి నాలుగు గడియలప్రొద్దు పోయినతరువాత మేము సుఖముగాపోయి యేలూరుచేరితిమి. అక్కడ గిన్నాళ్ళున్న మీదట పథ్యము వంటబట్టుట చేతను తల్లి దండ్రుల యాదరణచేతను న సవతితల్లి దేహము స్వస్థపడినది. ఒకనాడు నేనును నాసవతిమేనమామయు నుదయకాలమున దంతధావనము చేసికొని వీధిలో రావిచెట్టుచుట్టును గుండ్రముగా రెండడుగులయెత్తుగావేయబడియున్న యరుగుమీద గూరుచుండి యుంటిమి. నాసవతితల్లి తండ్రి రావిచెట్టునకును వేపచెట్టునకును పెండ్లి చేయించి వానిచుట్టును విశాలమయిన యాయరుగు వేయించినాడు. ఆయరుగుమీద చెట్టునీడను గూరుచుండి గ్రామకరణమెప్పుడును పనిచూచుకొనుచుండును. అప్పుడు ముప్పదిసంవత్సరముల యీడుగల యొకనల్లనిశూద్రుడు తెల్ల బట్టలు కట్టుకొని చంక మూటనుదగిలించుకొని వచ్చి 'మీరేమయిన కాసుల పేరు గొనియెదరా?' యని యడిగెను. మాసవతి మేనమామ 'ఏదీ చూపు' మని యడిగెను. ఆశూద్రు డరుగుమీద గూరుచుండి మూటనువిప్పి కాసులుపేరుతీసి యాతనిచేతి కిచ్చెను. ఆతడు చూచి వెలయడిగి నాచేతికిచ్చి బాగున్న దేమో చూడుమని చెప్పెను. నేను దానిని చేతబట్టుకొని నిదానించిచూచి, కొలికిపూసనుబట్టి యాన