Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేకరచరిత్రము

తీరని పనియున్నదని చెప్పి వారికి త్రోవచుపి తాను ప్రక్కదారిన పోయెరు. వారిద్దఱును దారియడిగి తెలుసుకొనుచు కొంతదూరము కలిసివచ్చిరి. సీతతానెఱిగియున్న వీధికిరాంగానే సుబ్బరాయని వెనుకదిగవిడిచి పరిగెత్తుకొని పోయి యొకసందులో నుండిమరలి తిన్నంగానింటికి బోయిచేరెను. సుబ్బరాయుండు చీకటిలో సీతపోయిన సందును కనిపెట్టలేక తిన్నగా వీధి చివరదాక నడచియిల్లుకనుగొన లేక గ్రామములో తిరుగుచుండెను. సీతవేళ్ళి వీధిగుమ్మము వద్ధ పిలువంగనే మంచముమిద పరుండి నిద్రపట్టక విచారించుచున్నమాణిక్యాంబ త్రుళ్ళిపడి లేచి పరుగేత్తుకొని వచ్చి తలుపుతీసెను. తలుపుతీసిన తోడనేసీతతల్లినికౌగిలించుకొని పెద్దపెట్టున నేడ్చెను. మాణిక్యాంబయు దుఃఖముపట్టజాలకకొంతసేపుతాను కూడ నేడిచి తనపైటచెఱంగుతో కొమారైకన్నులనీళ్ళు తుడిచి నిన్నంటినుండియు నెక్కడకు బోయితివనియు నింతచీకటిలోనొక్కతెవునెట్లురాంగలిగితి వనియు సీతనడిగెను. ఆక్రిందటి దినము ప్రొద్దుననే తన్నిద్దఱు దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజును మఱియొక చిన్నవాండును తన్నువిడిపించి తీసుకొని వచ్చుటయు, రామరాజే దోపనియున్నదని యూరివెలుపలి దాంకవచ్చి వేళ్ళిపోవుటయు, సీతచెప్పెను. అప్పుడారెండవ చిన్నవాండేమయినాండని తల్లి యత్యాదరముతో నడిగెను తనతో గూడ పయివీధివఱకును వచ్చినాండనియు, అతండు పూర్వము తమ్మందఱినెరగినవాడే యనియు, కొంచెం సేపటికెల్ల నచ్చటికివచ్చు ననియు కూంతురు బదులుచెప్పెను. ఈప్రకారముగా మాణిక్యాంబ సీతను తోడమిద గూరుచుండబెట్టు కొని మాటాడు చుండగానే మార్యోదయ మాయెను. అప్పుడు వీధిగుమ్మములో నెవ్వరొ "రాజశేఖరుండుగారి బస యెక్కడ?" నని యడిగిరి.ఆమాట వినియది