పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
పండ్రెండవప్రకరణము

రుక్మిణి కంఠము వలెనున్నదని వడిలో నుండి సీతను దింపిమాణిక్యాంబ వీదిగుమ్మము లొని కొక్కయంజె వేసి యెవరువారని కేకవేసెను. అప్పుడు సుబ్బరాయుడు మాణిక్యాంబను జూచి "అమ్మా"! కౌగిలించుకొని జోరున నేడువమొదలుపెట్టెను. అంతట వారందఱను గలసి లోపలికి బోయిరి. చెఱసాలలొ పెట్టబడిన దినముననే రాజశేఖరుండు గారు వ్యసనంపడుచు నొకచోట గూరుచుండి యూండగ బదిసంవత్సరములు దాటిన కారబద్దుండొకడా మార్గమున కాళ్ళసంకేళ్ళతో పోవుచు రాజశేఖరుండు గారి మొగము వంక గొంతతడవు చూచి యాయన సమిపమునకు వచ్చి కూరుచుండెను.

రాజ---నీపేరెవరు?

కానా--నాపేరు పాపయ్య; మాయింటిపేరు మంచిరాజువారు. నన్నెక్కడైనా జాచినట్టు జ్ఞప్తియున్నదా?

రాజ--మిమొగమెక్కడనోచూచినట్టేయున్నదికానియెప్పుడుచూచినానొమాత్రము స్మరనకురాలేదు. మంచిరాజు పద్మరాజు మికేనుగును?

పాప--నన్నుమీరు నల్లచెఱువు వద్దజువ్విచెట్టు క్రింద జూచినారు నేనప్పుడు బైరాగివెషములో నున్నందున, నన్నానవాలు పట్టలేక పోయినారు. పద్మరాజునాకొమారుండు.

రాజ--మునపటి యవస్త పోయి మికింతటిలోనిప్పటికీ దశయెట్లువచ్చినది?

పాప--నేనీ శోధనాద్రిరాజుతో చేసిన దోషముచేత, నాకీతని మాటవిన వలసివచ్చినది. ఈరాజు దారులు కొట్టుటకై నలుగురుని తోండితెచ్చి నన్ను వారికినాధునిగా జేసి నల్లచెరువునకు