పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పండ్రెండవ ప్రకరణము
మను-మాదికాకినాడ.ఈచిన్నది మాగ్రామ కరణము కూతురు. పేరుసీతమ్మ. అప్పగారియింటిలో పెద్దాపురముననుండగా, తండ్రియింటికిఁ దీసికొని పోవుచున్నాము. అక్కడకు చ్చుటకిష్టములేక రాగములుపెట్టుచున్నది
సీత-కాదుకాదు.నన్నువీండ్రెత్తుకొనిపోవుచున్నారు.

సుబ్బ-పెద్దాపురమునుండి కాకినాడకీయారు త్రోవకాదే. ఆచిన్నది చెప్పినమాటే నిజమని తోఁచుచున్నది.

ఈప్రకారముగాప్రశ్నోత్తరములుజరుగుచుండగా,వెనుకనుండియెవ్వరోయేమఱుపాటునవచ్చిసీతయొద్దనిలుచున్నవానినిజుట్టుపట్టుకొనివంగదీసివీఁపుమీదవీసెగుద్దులనుదబదబవర్షములాగునకురిపించెను.అదిచూచిరెండవవాఁడుసీతనుతనమిత్రునివిడిచిపెట్టిపరుగెత్తుటలోఁతనకుగలసామర్థ్యమునంతనుజూపెను.ఆక్రొత్తగావచ్చిననాతఁడును"పోనికుపోనికు"మనిచేతిలోనివానినివదిలివేసిపరుగెత్తుచున్నవానివెంటఁబడెను.అదేసమయమనిరెండవవాడుగూడరెండవవైపునకుఁబరుగెత్తిపరుగులోమొదటివానికంటెదిట్టమయినవాడఁనిపేరుపొందెను.ఆమనుష్యునికొంతదూరమువఱకుఁదఱిమి,క్రొత్తమనుష్యుడుమరలాసీతయున్నచోటిసివచ్చెను.
సీత-రామరాజుగారూ! నన్నాదొంగలనుండి విడిపించినారుగదా? ఇఁక

మాఅమ్మయొద్దకు తీసికొనిపోయి యొప్పగించరా?

రామ-అమ్మాయీ! ఏడ్వబోకు. నేనుసాయంకాలములోగానిన్నుఁదీసి కొనిపోయి మీయింటికడ నొప్పగించెదను.
సుబ్బ-రాజుగారూ! ఈచిన్నదానితల్లిదండ్రులెక్కడనున్నారు? వారు చిరకాలమునన్ను కన్నబిడ్డలవలేఁ జూచినారు.