Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖరచరిత్రము

రామ-అట్లయినమీరిచిన్నదానినెఱుగుదురా?
సుబ్బ-ఎఱుగుదును. ఈచిన్నది రాజశేఖరుఁడుగారి రెండవకొమార్తె. ఈచిన్నదియు నేనును నీమెయన్నగారును నన్యోన్యమును సోదరభావముననుండెడివారము; అందులో ముఖ్యముగా నీచిన్నదాని యప్పగారునునేనునుతానేనేననట్లు భేదములేకయుండెడివారము; ఈచిన్నదినన్నుమఱచిపోయినట్లున్నది.

రామ-ఈచిన్నదానితల్లిదండ్రులిప్పుడు భీమవరములో నున్నారు. వారివలన మీరంత యుపకారమును పొందియున్నయెడల, ఈచిన్నదానిని గొనిపోయి జననీజనకుల కడఁ జేర్చివత్తము దారి తోడుగావచ్చెదరా?

సుబ్బ-అవశ్యకముగా వచ్చెదను. నేనులోపలికిఁ బోయి యీసంగతిని మావాండ్రతోఁ జప్పి వచ్చువఱకును నిమిషమిక్కడ నిలువుండి.


అనిసుబ్బారాయుడు లోపలికిఁబోయి యింటివారితో సంగతి యంతయు జెప్పి యాచిన్నదానిని భీమవరములో దిగబెట్టి సాధ్యమయినంత శీఘ్రముగానే తిరిగివచ్చెదనని చెప్పెను. వారు వలదనియ నేకవిధములఁ జెప్పినను విననందున వారందఱును వీధి గుమ్మము వరకును వచ్చినాయన! వేగిరము రావలెనుజుమీ యని మఱిమఱి చెప్పిరి. రామరాజా చిన్నివాని సౌందర్యమున కాశ్చర్యపడుచు, ఇంతటి చక్కదనము స్త్రీలయందుండిన నెంతరాణిం చునని తనలోదాను తలపోయు చుండెను. అతడు వచ్చిన తోడనే రామరాజాచిన్నదానిని బుజముమీద నెత్తుకొని సుబ్బరాయనితో మాటాడుచు భీమవరము మార్గము పట్టి నడవ నారంభించెను.


రామ--మీరుబ్రాహ్మణులయ్యును, ఆప్రకారముగా తల పెంచుకున్నారేమి?