పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారు పెద్దపురము చేరుట- రుక్మిణి దేహమును వెదకి వచ్చి కానక దుఃఖించుట - పెద్ద్దాపురములోని వార్తలు - భీమవరమునకు ఁ బోవుట - అక్కడి విశేషములు - సుబ్రహ్నణ్యమును పిఠాపురము పంపుట.

రామరాజు నాఁటిరాత్రి మెల్లగా రాజశేఖరుఁడుగారిని కుటుంబసహితముగాఁ గొనిపోయి పెద్దాపురము చేర్చి , తిరుపతి రాజు చెఱువునకు సమీపముగనున్న సత్రములోదింపి, కాశీ ప్రయాణము మాని భీమవరములో నుండుడని బహువిధములఁజేప్పి , యొప్పించి తన దారిని బోయెను. ఒక్కనాఁటి ప్రయాణములోనే కూఁతురుపోవుటయు తక్కిన వారు బ్రాణములు దప్పించుకొని బయలఁబడినను కాళ్ళన్నియు వాచి యడుగు తీసి యడుగు పెట్టలేనంత దుస్థ్సితిలో నుండుటయుందలఁచుకొని యాత్రపేరన్న భయపడీ రాజశేఖరుఁడుగారు కొన్ని దినములలో భీమవరము చేరి యందుండి సమయమయినప్పుడు రాజు గారిని చూచుటకు నిశ్చయించుకొనిరి. రుక్మిణిపోయినదన్న విచారముచేతను మర్గాయాసమున బడలియుందుటచేతను వారారాత్రి వంటలు చేసుకొని భోజనము చేసినవారుకారు. వారికెవ్వరికిని కంటికి నిద్రయును పట్టలేదు. ఆరాత్రి నొకయుగముగా వేగించి రాజశేఖరుండుగారు కోడికూసినతోడనే లేచి తామొక్కరును బయలుదేఱి రుక్మిణిని వెదకుటకయి వేఁడిమంగలపు మార్గమున నడిచిరి.

అట్లు కొంతదూరము నడిచి రాజశేఖరుఁడుగారు పసులకాపరి బాలుర నడిగి మార్గమును గనుఁగొనుచు అడవిలోఁ బ్రవేశించి నాలుగు గడియల పొద్ద్దెక్కువఱకు దొంగలు కొట్టిన స్థలము చేరి యక్కడ రుక్మిణి దేహమును గానక యిసుకలో నెత్తురు చుక్కలను మాత్రము


</poem>