పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్నగుహ కలదు. అందులోఁ గూర్చుండి పాండవులు పూర్వమరణ్యవాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు. అందులో నప్పుడు చిన్న రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపునస్కారములులేక బూజుపట్టియున్న యాదేవర నుత్సవదినములలొ నర్చకుండొకడు పైకిఁ పులికాపుచేసి, ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహముఖంబునఁ దాను నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం తలకొకడబ్బువంతునఁ బుచ్చుకొని లోనికిం గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని జెప్పి పంపుచుండును. జనార్దనస్వామి కళ్యాణ దినములు నాలుగును వెళ్ళినతోడనే యెప్పటియట్ల స్వామిరథము యొక్కపగ్గములు నందుంచి వాని కాచిన్న దేవరను గావలియుంచి జీతబత్తెములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తితోఁ గాచుచుండు నాపిన్నదేవరయెడంగల విశ్వాసముచేత పూజారులు మఱుచటిసంవత్సర మాత్రాళ్ళపని మఱలవచ్చువఱకును ఆగుహత్రొక్కి చూడనక్కరలేక నిర్విచారముగా నుందురు. ఈ ప్రకారముగ మనుష్యులు భక్తివిహీనులయు దేవతాసందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులుమాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ముఁ దఱిమివేయునంతటిపాపముం గట్టుకొన్నదాఁక రాత్రులు దేవతాసన్నిధానమున్ గుహలో వట్టిభూతలముననే శయనించుచుండును. తూర్పువయిపునఁ బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిఱుగంటలు గాలికిఁగదలుచు సదా శ్రావ్యమయిననాదముతోఁ జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మెదట