పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 రాజశేఖర చరిత్రము

చుచు తన చల్లదనము వ్యాపించినంతవఱకు నిరుపార్శ్వములందు భూమినం తను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూరమునుండి బయలుదేఱి యడవిపండ్లును నెమలికన్నులు వహించి పొంగి నానాముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, పిన్నగంగ మొదలగువారి నాదరించి లోఁగొనుచు, అంతకంతకుఁ దనగంభీరత గానుపింప నాథుని వెదకికొనుచు వచ్చివచ్చి, యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివసించు జనార్దనస్వామి దర్శనము చేసికొని తోడనే యచ్చటనుండి తనశాఖారూపములయిన రెండుచేతులనుజాచి సరసతమీఱ నాథునింగలియు భాగ్యము గాంచెనో యాధవళగిరి, యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్రవరపుర సమీపమున మిక్కిలి వన్నె కెక్కి యుండెను.


ఆపర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లనిపిండిరాళ్ళతో నిండి యుండుటచేఁ జూచుట కెంతయు వింతగా మాత్రముండును; ఆరాళ్ళనుబట్టియే దానికి ధవళగిరియను నామము కలిగియుండును.దక్షినవైపున ఁ గ్రిందినుండి పర్వతాగ్రమువఱకును నల్లరాళ్ళతోఁ జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆసోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చకులయుఁ దదితరులగు వైష్ణవస్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయుచుండును. ఆసోపానముల వెంబడి బైకిఁ జనినచో గొండమీఁద నల్లరాళ్ళతోఁ గట్టబడిన సుందరమైన చిన్నదేవాలయమొక్కటి కానఁబడును. దానిచుట్టును.............. .............................వెత్తెడు ప్రాకారము మూఁడుప్రక్కలను బలిసి.................. ................................................బదులుగా పర్వతశృం............... ...............................................శయింప వానిని మించి

(ఈఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)