పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లో

త్స

ల ఇటీ తల, ర ను ఆదినాగు 50గు బంగారం --

సై 1/60404

అదిలాబాదు జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని స్లాష్యర్‌ గ్రామంలో ఫిబ్రవరి 11 నుండి 15 వరకు నాగోబ జాతర జరిగింది. ఈ సందర్భంగా నాగోబ జాతర గురించి తెలుసుకుందాం.

మూల ఆదివాసీలు అంటే ప్రకృతి సిద్దమైన మానవ సమూహం. అందులో గోందులది ఒక ప్రత్యేకత. ఆదివాసీ గోండుల జెండా చిహ్నం సూర్య చంద్రులు. ఆది ఎర్రరంగుతో ఉంటుంది. అందుకే గోండు తెగవారు సూర్యవంశం అనీ చెప్పుకుంటారు. పంచభూతాలతో సూర్య చంద్రుల ద్వారా పరిణామం చెందినామని, దీనిలో భాగంగానే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు తయారైనాయన్స, దాని ఆధారంగానే ఆదివాసీ గూడాల జనపాలన, జీవ పరిరక్షణ, మానవ విలువలు, క్రమశిక్షణ, ఆచారవ్యవహరాలు, పండుగల పద్దతులు, వంశాలు, గోత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మూలపురుషుడు, వ్యవస్థాపకుడు - వపొవొంజి కువాల్‌ లింగు.

ఈ వంశంలో దాదాపు 8 రకాల వారు ఉంటారు. ఉదా-మదావి, వెద్మ, పందవ్ర, మర్సుకోల, పూర్య, మెప్రం నాగబడి మొదలగు వారంతా 7 గోత్రాల వారే! ఈ వంశం వారందరికి(జల్లి+సల్లే) పెద్ద దేవర ఉంటుంది. నాగ్‌ వీడియ మెస్రం వారికి కూడా ఉంటుంది. కాని బుయగోట్టి మెస్రం వారికి మాత్రం నాగోబానే తమ దేవుడిగా కాలుస్తారు. ఏ వంశం వారికి ఆ వంశం (పెర్సపెన్‌ జాగా) సంస్థానాలు ఉంటాయి.

ఈ జాతరకు నాగోబ పూజకు మెస్రం వంశం వాదే కాక వారి బంధువులు, ఆడపడుచులు (ఢేలక్‌ మయక్‌) సోరియాల్‌ ధరియల్‌ వస్తారు. ఆడపడుచుల భర్తల (సోరియాల్‌ ధరియల్‌) అవసరం తప్పకుండా ఉంటుంది. వీరు లేక పోతే నాగోబ పూజ జరగదు.

ఆమాయక ఆదివాసులు నీరక్షరాశ్యులైన పేదప్రజలు జాతరకి వచ్చి, తమకు అవసరమైన ఇత్తడి, రాగి, దేవుళ్ల విగ్రహాలు, పెండ్లి, వ్యవసాయ సామగ్రి తీసుకుంటారు. వ్యాపారి ఎంత చెప్పితే అంత ఇచ్చి తీసుకోనీపోతారు. ఇది ఆనవాయితిగా జాతరలో జరుగుతున్నది.

ప్రకృతి సిద్ధంగా పంచ భూతాలను నమ్ముతూ, వాతావరణంలో జరుగుతున్న అద్భుతాలను దేవుడిగా పూజిస్తున్న ఆదివాసుల మనోభావాన్ని కూడా- బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టి, వ్యాపార దృష్టితో ధ్వంసం చేస్తూ, ఆదివాసీ సంస్కృతిని, ఆదివాసులను మైదాన ప్రాంతాలకు తరుముతూ, ఆదివాసీ స్థలాలను, సంపదను వశపరుచుకోవడం జరుగుతుందని గుసగుసలతో బయటి మేధావులు కోదైకూస్తున్నారు. మూల ఆదివాసి గోండు తెగ తమ ఆచారాలతో జరుపుచున్న మెస్రం బయిగోట్టి వంశ దేవుడైన నాగోబ జాతర కూదా ఆధునికంగా మారినది. 1942లో నైజాం ప్రభువు ఆహ్వానంమేరకు అండన్‌ నుండి వచ్చిన మానవ శాస్త్రవేత్త హైమన్‌డార్స్‌ 1992 వరకు గోండుల జీవన విధానాలను పరిశోధించి ఆనాటి, ప్రభుత్వాలకు నివేదికలు అందించినాడు. ప్రభుత్వ పథకాలు ఆదివాసులకు అందాలంటే ప్రభుత్వయంత్రాంగం, నాయకులు గూడాల వద్దకే వేళ్ళాలి. లేదా నాగోబ జాతరలలో, రాయిసెంటర్‌లకి పోయి సమస్యలు పరిష్మారించాలి. ఎందుకంటే వారి గోండు భాష వీరికి రాదు, వీరి భాష వారికి రాదు. అందుకే కేస్లాపూర్‌ నాగోబ జాతరలో గోండీ జన సమూహం సమస్యల పరిష్కారానికి 1995 నుంచి దర్చార్‌ జరుపుతున్నారు. నాగోబ జాతర పాలక పార్టీలకు వేదికగా మారింది. వచ్చిన లక్షలాది ప్రజలకు కనీస సౌకర్యాల కల్పన కష్టంగా మారింది. వందల మైళ్ళ నుండి నడిచి వచ్చేవారి కోసం నీరు, ఆహారం, పడుకోవడానికి సరైన స్ధలం ఏమీ ఉండదు.

ఇక్కడకు సుదూరాల నుండి వచ్చిన వారు పదే ఇక్కట్లు- వచ్చే జాతరకాలానికి ఉండవద్దని కోరుకుందాం.

-ఆత్రం భుజంగ్‌ రావ్‌, 9440585605