పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x

ఉషస్సుషమ

పళని కృతికిని గొంత ప్రత్యేకత కలదు. తరతరాలుగా రసికహృదయముల నూరించుచుండుటయే తార్కాణ. ఈ యుషాపరిణయమునకును - తాళపత్త్రజీవితకాళరాత్రి గడచినది. ముద్రణ మను యుషఃస్ఫురణ గల్గినది. ఇఁక రసికప్రశంసోదయరాగరమణీయ మగుటయే తరువాయి. అదియు ననతికాలమునఁ దీరునుగాక.

య స్వీ జోగారావు,
బి. ఏ. (ఆనర్సు)

ఆంధ్ర విశ్వకళాపరిషత్
పరిశోధనశాఖ, వాల్తేరు
1- నవంబరు, 1953.