పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉషాపరిణయము

సంపాదకీయ భూమిక

ఈ కావ్యమును రచించినది రంగాజమ్మ. ఇంటిపేరు పసుపులేటి. తండ్రి వెంకటాద్రి . తల్లి మంగమాంబ.

ఈమె తంజవూరాంధ్రనాయకరాజు విజయరాఘవుని యాస్థానకవయిత్రి. సంగీతసాహిత్యము లొకటిగ రూపెత్తిన విదూషి. విజయరాఘవనాయకాంకిత జీవిత ప్రణయ కావ్య.

విజయరాఘవుని పాలనము. క్రీ. శ. 1633 నుండి 1673 వఱకు నని చరిత్ర. ఇతని రాజ్యత్వమున నాంధ్రభాష యొకవెల్గు వెల్గినది. ఎందరో సంగీతసాహిత్యసరస్వతుల కితని కొలువుకూట మాటపట్టు. వారిలో రంగాజమ్మది యగ్రతాంబూలము.

ఒకనాఁడు కొలువు దీఱియుండఁగా విజయరాఘవుఁడు దన్ను హరివంశములోని యుషాపరిణయకథఁ దెనుఁగు గావింపుమని కోరినాఁడఁట. ఈ ప్రస్తావమున నీమె పూర్వగ్రంథ ప్రశంస కూడ నున్నది. మన్నారుదాసవిలాస ప్రబంధము; రామాయణ భారత భాగవత సంగ్రహములు; ఇవిగాక కొన్ని యితర మధురపదములు, దీనిని బట్టి యీ గ్రంథ మైదవ రచన యని తేలుచున్నది. మన్నారు దాస విలాస నాటకము కడపటిది. ఉషాపరిణయము దానికి ముందటిది.

మన్నారుదాసవిలాస నాటక మింతకు ముందే యాంధ్రసాహిత్యపరిషత్తు ముద్రించినది. దాని పీఠికలో శ్రీ జయంతి రామయ్య పంతులుగారు, 'ఈనాటకము 1660 ప్రాంతమునఁ బుట్టియుండు నేమో' యని తమయూహ వెలిబుచ్చిరి. ఈ యుషాపరిణయ పీఠికాకారులు శ్రీ యస్వీ జోగారావు గారి నిర్ణయచమత్కారమునకుఁ బైయూహకు నెంతయో యంతరము లేదు. తన్ను నుషాపరిణయము వ్రాయఁ