పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఉషాపరిణయము


క.

గ్రక్కునఁ బ్రలంబవైరియు
నక్క జముగ భసిత మెడలు(నట్లు)గఁ ద్రోయన్
జిక్కిన తచ్ఛేషంబును
మిక్కిలిఁ దాపంబు నతని మేనం జూపెన్.

58


సీ.

బలభద్రుఁ డపుడు కన్నుల నిద్రజేరంగ
        నావులింపుచు భ్రమం బావహిం(చి)
(చు)ట్టుఁ దిరుంగుచు నిట్టూర్పువుచ్చుచు
        రోమాంచమిళితగాత్రుండు నగుచు
నల్లనల్లన వచ్చి యల్ల జనార్దను
        జేరి దేవోత్తమ! చిత్స్వరూప!
కృష్ణ! హృషీకేశ! యిప్పు డీతాపంబు
        నేర్పుమై శాంతిఁ బొందింపు మనినఁ


గీ.

గమలదళనేత్రుఁ డాబలుఁ గౌఁగలించి
జ్వరకృతంబైన తాపంబుఁ జనఁగఁ జేసె
నంత యెప్పటియట్ల యనంతబలుఁడు
[1]ప్రబలుచుఁ బ్రకాశించెను భవ్యలీల.

59


శ్రీకృష్ణుఁడు మహేశ్వరశక్తితో యుద్ధము చేసి జయించలేక ప్రతిశక్తిని నిర్మించుట – రౌద్రవైష్ణవశక్తుల యుద్ధము

వ.

ఇవ్విధంబున నిజాగ్రజుం బృహృష్టాంతరంగుఁ గావించి పుండరీ
కాక్షుండు మహేశ్వరజ్వరంబునగ్రంబున నిలిచి యిట్లనియె.


గీ.

దుర్మదము మాని తొలఁగు నీపేర్మి యింకఁ
జెల్ల దీయడఁ గాదని చేరితేనిఁ
గఠిననిర్ఘాతసమముష్టిఘాతములను
నీదుగర్వం బణంచెద నిక్కువంబు.

60
  1. ప్రబలి ప్రకాశించె భవ్యలీల