పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

99


తన కేతుదండంబుఁ దనర నానుకనిల్చి
        పరుషవాక్యంబులుఁ బలికి మిగుల
మనమునఁ గోపంబు (మలయుచు నుండం)గఁ
        గుంభాండుఁ జూచి యీకులవిదూరుఁ


గీ.

[1]గొదవ యెన్నఁడు లేని యీ కులమునకును
నిందఁ దెచ్చిన వీనిని నీవు వేగ
యింపుమీరంగ నిపుడె హింసింపు మనిన
నసురవిభుఁ జూచి మంత్రి యిట్లనియె మగుడ.

92


బాణాసురుం డనిరుద్ధుని నాజ్ఞాపింపఁగాఁ గుంభాండుండు వారించుట

ఉ.

ఓరజనీచరేంద్ర! హిత మొక్కటిఁ జెప్పెదఁ జిత్తగింపు మే
తీరున? వచ్చె వీఁ డిటకుఁ దేఁకువ నెవ్వరు? తోడితెచ్చి రే
యూరు? కులంబు? వీని కని యోర్పమరంగ వివేకశాలివై
యారసి పిమ్మటన్ దగు నుదగ్రతరంబుగఁ దెంపు సేయఁగన్.

93


సీ.

శుక్రున కెనయైన శౌర్యంబుఁగలవాఁడు
        ఘనభుజాబలముచేఁ దనరువాఁడు
నిఖిలాస్త్రములయందు నేర్పుఁగల్గినవాఁడు
        భానుతేజంబుచేఁ బరఁగువాఁడు
కమనీయశృంగారగరిమఁ జెన్నగువాడు
        నలరువిల్తునిరీతి నలరువాఁడు
రాజలక్షణములరమణ గాంచినవాఁడు
        చిన్నిప్రాయంబునఁ జెలఁగువాఁడు

  1. కొదవ యెన్నడును లేని కులమునకును