పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

91


చ.

ఘనముగ నార్పు లుప్పతిలఁ గైదువలున్ ఝళిపించి వచ్చునా
దనుజులఁ జూచి డెందమునఁ దద్దయు భీతిలి యీదురాత్మకుల్
తనపతి నేమి సేతురొ! యుదగ్రత నంచును జింతఁ జెందు జ
వ్వనిఁ గని మందహాసమున వారిజనాభుని పౌత్రుఁ [1]డిట్లనెన్.

64


ఉ.

ఇంత చెలింపనేల? యిపు డేఁ గలుగంగ సమస్తదైత్యులున్
బంతము లాడుచున్ నడవ బాణుఁడు వచ్చిన సంగరంబునన్
ద్రుంతు జయంబుఁ జేకొనుదు దోర్బల మొప్పఁగ నీకు నిప్పుడే
సంతస మొప్పఁ జేయుదును సారసలోచన! నీవె చూడఁగన్.

65


గీ.

అనుచుఁ దగఁ బల్కి యంకుశాహతినిఁ గినియు
గంధకరిలీల వెస లేచి కంతుసుతుఁడు
భయముచేతను వారించు పడఁతిమీరి
వీఁక దైత్యుల మార్కొనె విక్రమమున.

66


వ.

ఆసమయంబున బాణపుత్రియగు నుషాకన్య మనంబున ఘనం
బుగా భయంబుఁ జెంది తనసమీపంబుననున్న చిత్రరేఖంజూచి
వజ్రపాణికైనం దేరిచూడఁగూడని యీబాణాసురుని బలంబుల
కెదిరి యీయనిరుద్ధుం డెట్లు? జయంబుఁ జేకొను నని యడిగిన
నుషకుఁ జిత్రరేఖ యిట్లనియె.


క.

అనిరుద్ధుని లా వెఱుఁగక
వనితా! మదిలోన నిట్లు వగవఁగ నేలా?
దనుజుల నందఱ నిప్పుడె
యనిమొన నిదె గెల్చివచ్చు నసహాయుండై.

67


వ.

అని పల్కి.

  1. డిట్లనున్