పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

69


చక్కెర లొల్కెడు చక్కని యీతని
        కెమ్మోవిఁ జూడుము కీరవాణి!
పండువెన్నెలచాయ భాసిల్లు నీతని
        కుఱునవ్వుఁ జూడు చకోరనయన!


గీ.

యరులపై బాణవర్షముల్ కురియుకతన
జ్యాకిణాంకితమించు బాహాయుగంబుఁ
బరులతల మెట్టు మృదు[1]పాదపంకజముల
భామ! వీక్షింపు కన్నులపండువుగను.

3


వ.

అని పల్కుచున్న సమయంబున.


అనిరుద్ధుఁడు కలఁగని మేల్కని యాశ్చర్యపడుట

సీ.

అందంబుమీరంగ నలివేణి యొక్క
        యెలమిఁ దోడ్కొనివచ్చి యింపుమీరు
బంగారుమేడలో బాగుగా హవణించు
        పువ్వులపాన్పుపైఁ బొసఁగ నుంచ
మెఱుఁగుదీఁగెనుబోలు మృగనేత్ర యొక్కతె
        శయ్యపైఁ గూర్చుండి నెయ్యమమరఁ
జక్కెర మోవాని సరసంబు మీరఁగాఁ
        బుక్కిటివిడె మిచ్చి బుజ్జగించి


గీ.

 తలిరువిలుకానికేళినిఁ దనివిదీరఁ
గలసినట్లుండఁ గలఁ గని కాంక్షతోడ
బాళి నయ్యనిరుద్ధుండు మేలుకాంచి
యెదుట నిలుచున్న చక్కనియింతిఁ జూచె.

4
  1. వార