పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1


విజ్ఞప్తి

పరమాత్మస్వరూపులగు మానవోత్తములారా ! పరమ పవిత్రమై వెలయు కృష్ణానదీతీరమందు లోక ప్రసిద్ధి గాంచి వెలయుచున్న విజయవాడ నగరమున శ్రీ వ్యాసాశ్రమస్థాపకులైన శ్రీశ్రీశ్రీ మలయాళ సద్గురుమూర్తులు సర్వజీవులయొక్క తరణోపాయమునకై చాతు ర్మాస్యమహావతమును జరుపవలెనని తలంచెను. తక్షణముననే మహా వైభవము లైన పూజాసభాభవనములును, పెద్ద పెద్ద కొట్టములును, చిన్న చిన్న కుటీర ము లును, భోజనశాలలును, విద్యుద్దీపంబులును నీళ్ల పంపులును, పాకీ పనివారలతో సహాసమస్త వసతులును అమర్చబడెను. వేలకొలది సాధువులును, అనేకులు గృహస్థులైన భక్తబృందములును క్రిక్కిరిసిపోయిరి. అచ్చట నివాసముగాయుం డువారికి గాని, వచ్చుచు పోవుచున్న వారికిగా నిఒక్కొక్క దినమున కొక్కొ క్కరువంతున పుణ్యాత్ములైన గృహస్థులు భక్ష్యపదార్థములతో ఎంత ఖర్చయి నను భరించి, భిక్షలుచేయ నారంభించిరి. అట్టి మహామ్రతమునందు ప్రతిరోజున శ్రీవారు సభికులు పరమానందముజెందునట్లు అనంత బోధామృతవర్షమును అప్పుడప్పుడు ఇతరుల ఉపన్యాసములును, భజనలు, పూజలు, హరికథలు, సంగీత గానములును మహానందముగా జరుగు చుండెను సౌధుబృందము లందరికిని శ్రీమంతులైనవారు పలువిధములైన దానములును. చేయుచుండిరి. ఇదియంతయు చూడ జూడ ఋషి పుంగవులకు అణిమాది సిద్దు కామధేనువు, కల్పవృక్షు, మహిమలును గురిపించుచుండిరి. చింతామణ్యాది యుండుట యదార్థమేనని ప్రత్యక్షముగా దోచుచుండెను. పూర్వ కాలమున గోమతీతీరమున శౌనకాదిమహర్షులు జరిపించిన చాతుర్మాస్య ములు జ్ఞప్తికివచ్చెను. అప్పు డాయాగమును చూడకపోయినను ఇప్పుడీ వ్రతమును చూచు సంపా ప్తము గల్గినందుకు సమస్త భక్తబృందములును ధన్యాత్ములయి నట్లు తలంచిరి. అట్టి చాతుర్మాస్యమహాసభలో శ్రీవారు చెప్పిన అనంత ప్ర్రబోధములో సాధకులుగా యుండు సర్వసోదరసోదరీమణులందరికిని ముఖ్యముగాఉపయోగించునట్టి చిన్న చిన్న వాక్యము లనుదినమునకొక్కటి రెండు వంతున రత్నములవలె స్వీకరించి అట్టి వాక్యములన్నింటిని చిన్న పొత్తముగా అచ్చువేయించినచో సర్వమానవులకు గొప్పగా ఉపయోగపడగలదని అచ్చు వేయించడమైనది.

ఇట్లు,

సాధు సూరారెడ్డి, సంపాదకులు.