పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ఉద్భటారాధ్యచరిత్రమున మొదటినుండియు ఆకరగ్రంథములను సమకూర్చి నాకు చేదోడు వాదోడుగామన్న నా పెద్దకుమారుడు చిరంజీవి శివసుందరేశ్వరునకు నా యాశీస్సులు.

సీ.

వీరశైవాచార విపుల ధర్మపథాను
                       వర్తి వీరన్న నూవంశగురుఁడు
ప్రథితమల్లమపల్లి వంశజి పార్వతీ
                       తరుణీమతల్లి నాతండ్రితల్లి
పార్ధివేశ్వర దివ్యపాదసేవకుఁడు సుతి
                       దర నామధేయుఁడు నాదుతండ్రి
సహజైకలింగనిష్ఠాపరతంత్రుండు
                       నాగయ్యయోగి దీక్షాగురుండు


గీ.

జననమే యా నియోగివంశమునగాని
బాల్యముననుండి శికభక్తిపరతచేత
అమలతర శైవసంప్రదాయములు దక్క
వేఱెఱుంగను పండితులార నేను.


23-8-73ఇట్లు
లక్ష్మీకాంతనిలయమునిడదవోలు వెంకటరావు
2-2-1187/5
క్రొత్తనల్లగుంట
హైదరాబాదు.44