పుట:ఉదాహరణపద్యములు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రిపురవిజయము 5

సీ. కొండంత హేమకోదండంబు విలసద
హీనగుణంబున నెక్కువెట్టి
హరినీలమణికాంతి యగునమ్ము శరధి పొం
దెడలించి వలచేత నేర్చిపట్టి
స్వరముల సకళించు వారువంబుల గుణా
ధార భూతంబగు తేరఁ బూన్చి
నలుదిక్కులను జూడ్కు లొలయంగ సకలంబుఁ
గనువాని సారథిగా నొనర్చి
కడఁగి రథచక్రములు తన కన్నులట్ల
యేమఱకయేఁగి త్రిపురంబు లేర్చి సకల
లోకములు నెమ్మిఁబ్రోచు పినాకపాణి
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత. 9

(మారన)



సీ. జడివట్టుఁ బడగలు పడగల మీఁదిచోఁ
గదలెడి కండ్లును గండ్ల నడుపు
సూత్రించు జోడును జోడుపైఁ జరియించు
బంట్లును బంట్లకుఁ బాయరాని
ధనువును ధనువుతోఁ దగిలిన యరదంబు
నరదంబు క్రిందికి నరుగు నారి
నారి నిద్రించు బాణము బాణ మొదవించు
సూతుండు సూతసంజాతహరులు
గాఁగ నద్భుతార్థకరపదార్థావళి
యుల్లసిల్ల నొప్పుచున్న దిపుడు
త్రిపురహరణకరణదృఢదత్తవీర మ
నోరథంబు దేవ నీరథంబు. 10

(నిశ్శంకుని కొమ్మయ)