పుట:ఉదాహరణపద్యములు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఆంధ్రకవి రామయ్య – విష్ణుకంచీమహాత్మ్యము
సీ. శ్రుతులును నిర్జరస్థితులును మగుడింప
నిగుడింపఁ జాలు నీ నేర్పుకలిమి
ధరణియు రిపుగర్వసరణియు ధరియింప
హరియింపఁ జాలు నీ యలవుకలిమి
భ్రాత నర్మిలిఁగన్నమాతనుఁ బాలింప
లాలింపఁ జాలు నీ లావుకలిమి
గేహని రవిసుతావాహిని సాధింప
భేదింపఁ జాలు నీ పేర్మికలిమి
తే. జనులఁ బాతకజనులను జరుప నురుప
నలరు నీ నేర్పు కలిమిచిహ్నములు నీకు
మత్స్యకూర్మమహీధరమనుజసింహ
ఖర్వరామత్రయీబుద్ధకలికిగతులు.

శ్రీలక్ష్మికి - ఎఱ్ఱాప్రెగడ నరసింహపురాణము
ఉ. చందనచారుపత్రము సంస్తుతకౌస్తుభకర్ణికంబున
స్పందితలాంఛనభ్రమరసంజమనోజ్ఞమునై తనర్చు గో
విందు నురస్థలంబ యరవిందముగా సొగయించియున్న య
య్యిందిర చూచుగాత కృప నింపగుజూపుల భక్తసంతతిన్.

పోతరాజు భాగవతము – దశమస్కంధము
మ. హరికిం బట్టపుదేవి పుణ్యములప్రోవర్థంబు బెన్నిక్క చం
దురు తోఁబుట్టువు భారతీగిరిసుతన్ తోనాఁడు బూఁబోడి తా
మరలం దుండెడు ముద్దరాలు జగము ల్మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములఁ బాపు తల్లి సిరి యిచ్చు న్నిత్యకల్యాణముల్.

సుదర్శనము - వీరమాహేశ్వరము
సీ. దైతేయకాంతల తళుకుఁ గెమ్మోవుల
వీటికాశ్రీలకు వీడుకోలు
వేల్పుటిల్లాండ్ర క్రొవ్విదపుఁ జన్నులమీఁది
యళువు పయ్యెదలకు నిలువనీడ