పుట:ఉదాహరణపద్యములు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 శివస్తుతి

మనఁగనుంగొనఁ బాయరానట్టి మోహ
మిచ్చి నొదవించు నెవ్వాని యిల్లువిల్లు
బెరయు నెవ్వాని పలుకులు బేసియగుచు
నెందు నెవ్వాని సేవింతు రెల్లసురలు.

(నిశ్శంకు కొమ్మయ)



సీ. దీపించు నే వేల్పు దివ్యాలకంబులఁ
గాళీకుచాంగరాగంబుభూతి
కొమరొందు నేవేల్పు గురుజటాభరసీమ
నమృతాంశుఖండంబు నభ్రగంగ
కడుమించు నేవేల్పు గాత్రవల్లిక చుట్టు
వ్యాఘ్రచర్మము వారణాజినంబు
కరమొప్పు నేవేల్పు కంఠపీఠంబున
భుజగేంద్రహారంబు పునుకపేరు
నట్టి వేలుపు శంకరుండాదిమూర్తి
వేదవేదాంతవేద్యుండు విశ్వభర్త
విసకితోజ్జ్వలవదనారవిందుఁడగుచు
నుచి(తరీతిఁ) బేరోలగం బున్నయంత.

(శ్రీగిరన్న – శ్రీరంగమాహాత్మ్యము)



సీ. ఔఁదలం జదలేటి లేఁదరంగంబులు
బాలచందురుని నుయ్యాల (లూఁపఁ)
దొడవుల తలలఁ జెన్నడరు మానికముల
చాయ దిక్కుల నెఱసంజ పఱుపఁ
దోరంపుటేనికతోలి యుత్తరికప్పు
కుత్తుక కఱతోడఁ బొత్తుసేయ
బూడిదపూతల బూదర సరచిన
పునుకలపే రురంబునఁ దలిర్ప