పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. కఠితనిజదీర్ఘబాహుశృంఖలిక యగుచుఁ
కమలవనసీమ నిశ్చలత్వము వహింప
భూరికీర్తి విశృంఖలస్ఫూర్తి యగుచు
నతివ యితఁ డేలు సింహళం బనెడు దీవి. 85

ఉ. దానికిఁ గొంత దూరమునఁ దామరసేక్షణ చూడ నొప్పగున్
భూనుతవైభవంబు మణిపూరపురంబు సమస్తవస్తుసం
తానసమగ్ర(మై సతతదానదానఝరీద్విరదైక)*వాసమై
మానవతీకటాక్షసుషమానవవిభ్రవరత్నపేటియై. 94

గీ. అప్పురంబున కధినాథుఁ డతివ యితఁడు
జైత్రకళనామధేయుండు జలజబంధు
వం(శజుఁడు వీని నిత్యాధివాసభూ)*మ్య
నిజయశోగంగ కినసూతి నెమ్మినెఱపు. 95

క. కేలం జాపము గైకొని
కోలుతలన్ విందు చూపు గుణనినదంబుం
పోలు నిజాధిముఖారి నృ
పాల రమాచరణ కటక(పటుఝంకృతులన్)*. 96

చ. నెలఁతుక తామ్రపర్ణి యను నిమ్నగ యమ్మలయావనీ ధర
స్థలవిలసత్ప్రతీరత(రుసంచితసౌరభశేత్యలబ్ధి)* చేఁ
బొలిచి విలాసలీల మెయి భూరిగుణాకర వల్లభాత్మ మున్
వలనుగఁ బూనచుండు ననువాసరముం జలరాశి సంగతిన్. 102

ఉ. అన్నది నిర్మలోదక సుధాధిక మాధురి కోహటించి సు
కన్నులు....................... 104

అసంపూర్ణము



ఆంధ్రసాహిత్యపరిషత్ప్రతియం దింతవఱకే కలదు.





  • లుప్తభాగములు ప్ర.మ.భూ.లోని 530, 531, 532, 534 సంఖ్యగల పద్యము లాధారముగ పూరింపఁబడినవి.