పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. అదియున్ మోదమెలర్ప నారదుని మాహాత్మ్యంబునం జేసి తో
యదమార్గ[oబునఁ బాఱి యల్లన నదృశ్యంబయ్యె [1]][2] దైత్యారియుం
దదనుప్రేషితదృష్టిలో నిలిచె విందక్షోణి భృత్సోదరీ
సదుదంత శ్రవణోధితామృతరసాస్వాదానుమోదార్థియై. 59

క. మందారమాలికయుం దా[3]
విందానుజ నూరడించి వేవేల శతా
నందసుతు మహిమ మరలి ము
కుందుని సన్నిధికి వచ్చి కుతుక మెలర్పన్. 60

శా. దేవా దేవరయాజ్ఞ మౌళిఁగొని సందేశాక్షరశ్రేణ చే
తోవీథి న్నెలకొల్పి యేను మునిరాడ్డుర్వారవాక్శక్తిచే
నీవీ డప్పుడు నిర్గమించి చదలన్ హేలాగతి న్బోవుచో
దేవేంద్రాతి సమస్తదేవతలకున్ దృష్టింపరాకుండితిన్. 63

గీ. గగనతల చుంబి సౌదశృంగములు గడచి
కనకతోరణశృంగాటకములు దాఁటి
కరసముద్ధృతఖడ్గసంకలితసుభట
రక్షితం బైన నృపమందిరంబుఁ గంటి. 113

మ. నివషత్పుష్పకదంబ మైన మరుతూణీరంబునం బోలె న
య్యవరోధం బలరారు నే నతులతో నారాజ బింబాస్యలం
జివురుంబోఁడుల నీలకుంతలల రాజీవాక్షులన్ హావభా
వవిలాసైకనిరూఢలం దనివివోవం జూచితిం జూడ్కికిన్. 123

ఉ. ఆ సరసీరుహాక్షులు ప్రియంబునఁ జుట్టును జేరి కొల్వ ను
ల్లాస మెలర్పనున్న శుభలక్షణలక్షిత మిత్రవింద న
బ్జాసన సృష్టికిన్ మొదలి యచ్చును బోనియనంగవైభవన్

భాసురరూపయౌవనవిభాసితఁ గంటి రమేశ యత్తఱిన్. 127

  1. రి వాలంకించె (సా.ప.)
  2. ప్రా.పూరణము
  3. ప్రాసవ-మాలికెయును (సా.ప.)