పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిశిరోపచారములు


సీ. కోకిలంబుల కేటికో ళ్ళిత్తు మిభరాజ
గామిని కీబారి గడచెనేని
యెలమావులకుఁ జేతు మెలమి జాతర లిందు
ముఖి నేలఁ బాదంబు మోపెనేని
బొండుమల్లెల బోనములు వోతు మళులకు
బదఁలి యీసారెకు బ్రతికెనేని
కీరసంతతికిఁ జక్కెరకాన్క లొసఁగుదు
మలివేణి ప్రజలలోఁ గలిసెనేని
తే. యనుచు గోకిలమాతపోతాళికీర
విసరమున కిట్లు వేవేలు విధుల మ్రొక్కి
సంభ్రమంబున నా సరోజాతముఖులు
చెలువశిశిరోపవిధు లిట్లు సేయఁగడఁగి. 75

సీ. తనుగాడ్పు దూరని దట్టంపు లేమావి
మ్రాఁకుల నడిమి యీరమునఁ జంద్ర
కాంతంపుమణులచేఁ గట్టిన కుట్టిమ
స్థలి బాలకర్పూరతరులు దెచ్చి
కంబముల్ పరుపులు గావించి పై నంద
ముగ లేఁతమరువంపుమొలక ద్రిప్పి[1]
తిరిగిరా నెలదమ్మి విరుల రేకులతోడ
దవనంపుఁబొరకల దళ్ళు గట్టి
తే తమ్మిపూఁదేనెఁ దడిపి చందనము మెత్తి
కలయ నంతట సిరిపచ్చకప్పురంబు
నెఱపి వివిధాంతరములుగా నేర్పు లలర
సఖులు గల్పించి రపుడు పూఁజప్పరంబు.



  1. మొలకటిప్పి