పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. జగదానందనకారణంబ వగు నీ చంద్రాఖ్యఁ బాటింతు నీ
కగునా మా యబలన్ శశాంకముఖి నాయాసంబు నొందింపఁగాఁ
దగునా యోషధిభర్త వయ్యును లతాతన్వంగి నిట్లేఁప లో
కగరిష్ఠుండవు[1] చందమామవలె నాక్రౌర్యంబు మా బాలపైన్. 70
 
గీ. కువలయానందకరుఁడవు భువనవంద
నీయుఁడవు నీవు నేరము నిన్నుఁ బొగడ
నబలలము మేము మమ్ముల నాదరించి
చెలువఁ జలిగాలఁదన్ని[2] రక్షింపు చంద్ర.
 
మ. చది ధాత్వర్థము నీకు సార్థ మగుటం జంద్రాఖ్యఁ బాటింతు నీ
యుదయం బభ్యుదయైక హేతువయి సేయున్ వార్ధికానంద సం
పద నీ కాయము కేవలామృతరసప్రాయంబు నీ రాకలం
బొదలున్ లోకము చంద్ర ని న్బొగడ మాబోం ట్లెంతవారల్ మహిన్. 72

సీ. కలహంసలార మా కలహంసగమనకు
గతిమీరి యీబారి గడపరయ్య
కీరంబులార మా కీరసంభాషణ
పలుకులు ముద్దుగాఁ బట్టరయ్య
మధుపంబులార మా మధుపనీలాలక
కొప్పు దప్పిడక మేలొందుఁడయ్య
కలకంఠులార మా కలకంఠిఁ గన్నెఱ్ఱ[3]
వారిచూడక యాఁచి పలుకరయ్య
ఆ. ధన్యులార పుష్పధన్వు సావడిఁ బేరు
పడిన యట్టి వీరభటవరేణ్యు
లార మా యొనర్చు భూరిసంప్రార్థన
లాదరించి కావరయ్య చెలిని. 73
 
వ. అని మఱియును— 74



  1. లోక గరిష్టుండగు
  2. చెలువ చలి గాలిదన్ని
  3. కలకంఠి కన్నీట