పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. అభ్యుదయపరంపరాభివృద్ధియు నభిమతార్థసిద్ధియుంగా నాయొనర్పం బూనిన యుదయనోదయంబను మహాప్రబంధంబునకుం గథాప్రారంభం బెట్టి దనిన— 77

కథాప్రారంభము


సీ. కమలాస్తరధరధ్యగమనఖేదవిదారి
గోపానసీలసద్గోపురంబు
ఘనసౌధశిఖరాగ్రగతసతాకాశాటి
కాచపేటోద్ధూతకంధరంబు
గంధవారణఘటాకటగళన్మదవారి
కర్దమీభూతశృంగాటకంబు
సవిధోపవనవికస్వరపుష్పసౌరభా
వర్జితామరపూరీవనమదాళి
తే. యగుచు రాజిల్లుఁ గ్రీడాచలాగ్రఖచిత
మరకతాంభోజరాగోరుమణి శశాంక[1]
కాంతకాంతిచ్ఛటా(నేక)కల్పితేంద్ర[2]
చాపవిభవంబు కౌశాంబికాపురంబు. 78
 

పురవర్ణనము


ఉ. అన్నగరంబుమేడల రతాంతపరిశ్రమఖేదఖిన్నలై
యున్న సమున్నతస్తనల కొయ్యనఁ[3] జెమ్మట లారవీచు నా
సన్నవియన్నదీజనితసారసరోరుహభూరిసౌరభ
చ్ఛన్నమరందబిందుపరిషత్సముపేత[4]సమీరపోతముల్. 79



  1. నితాంత విటంక
  2. కార్విక్రింద; కారితేంద్ర
  3. స్తనల (కొల్వన)
  4. సవిషత్సముపేత