పుట:ఉత్తరహరివంశము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


మకరందమున నిండుమధుకరంబులుఁ బోలె
                 నేత్రోత్పలంబులు నీటఁ దేల
నెఱి దప్పి వ్రాలిన నీలమేఘమువోలె
                 గచభారబర్హ మగ్గలము వీడఁ
దొడఁగి చాలఁ జలించు తొండంపుగవవోలె
                 నూరురంభాస్తంభయుగము వడఁకఁ


తే.

గడఁక లేనితనూవల్లి ఘర్మజలము
దళముగాఁ జిందఁ జెందనితాల్మితోడ
వగపుచిత్తరువో కళవళముకరువొ
యనఁగ నొకకాంత గానంగ నయ్యె నంత.

178


వ.

ఇవ్విధంబున నవ్వామలోచన వసుదేవనందను ముందట నిలిచి.

179


క.

అమరారి చెవులముందఱఁ
గొమరారి వెలుంగు నమృతకుండలముల న
త్తిమిరారిద్వయ మన నె
త్తి మురారికిఁ జూపి యపుడు దెలియఁగఁ బలికెన్.

180


ఉ.

ఏను వసుంధరన్ యదుకులేశ దయాకర సూకరాకృతిం
బూనిననాఁడు నీవు ననుఁ బొందినఁ బుట్టినవాఁడు వీఁడు నీ
చే నపరాధుఁ డైన మఱి చెప్పెడి దెవ్వరికింకఁ గింక లో
నూనఁగ నీక కుండలము లొప్పఁగ నొప్పన గొమ్మ క్రమ్మఱన్.

181


గీ.

అకట యిచ్చివవాఁడు దయ్యంబ కొన్న
వాఁడు దయ్యంబఁ దీనికి వగవ నేల?
కాలపా[1]కంబు దప్పింపఁ గమలనాభ!
నాదు దుఃఖప్రలాపంబునకుఁ దరంబె.

182


క.

తనయుని[2]కి పదిలముగ నా
తనయునికిం గలుగ దితనితనయునికైనన్

  1. శంబు దప్పదు—నకుఁదలంచి
  2. కిం బదిలము