పుట:ఉత్తరహరివంశము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఉత్తరహరివంశము


క.

కమ్ములఁ దవిలెడు నేనిక
కొమ్ములు నెమ్ములును సుభటకోటులయమ్ముల్
నెమ్మనము నూఁకు నెఱుపగ
నుమ్మలికపుఁ గింకఁ గొంక కురవడి నేసెన్.

149


మ.

దనుజుం డేసినసాయకంబులు గరుత్మంతుండు పక్షావళీ
ఘనకక్షాంతరవీథులన్ [1]నిలిచి వీఁకన్ మేను వొంగంగ హు
మ్మని జాడించిన లాగు వేగమునుగా నాయంపచా లేసె నా
తనిపై సారథిపై హయంబులపయిం [2]దట్టాడఁ బెట్టాడుచున్.

150


సీ.

క్రేగంటి చూపున గిఱిగొన్న సన్నగే
                 దఁగిఱేకుల కన్నదమ్ము లగుచు
జడకొప్పులోను [3]నచ్చపుసజ్జకములైన
                 విరవాదులకు వింతవిందు లగుచు
బిగువుఁజన్నులమీఁదఁ బెనుపడం బై న చెం
                 గలువ క్రొవ్విరుల సంగడము లగుచు
[4]గేలకి హరి వైవఁ గేలఁ దాలిచిన సం
                 పఁగిబంతికొనల జోపాప లగుచు


తే.

[5]వేగ నరకాసురుం డేయు వేగిరంపు
బాణములఁ బ్రాణములు సత్యభామమేనఁ
గుసుమశృంగారముల కెల్లఁ గ్రొత్త సేయ
నెనిమిదిదెఱంగులై సొబ గినుమడించె.

151


క.

పగలిటిభానుఁడు వోలెను
ధగధగ యను మొగము దివుర దనుజుం డేసెన్
జగదేకనాథుమీఁదను
దెగ నిండఁగ దిగిచి యొక్కదివ్యశరంబున్.

152


క.

అరచందురు డెందములోఁ
జొరఁబాఱి వణంకు తోఁకచుక్కయపోలెన్

  1. విఱిచి
  2. దట్టాడు చిట్టాడుచున్
  3. ప్నచంపక సజ్జక
  4. గెలిచిన
  5. వెఱచి