పుట:ఉత్తరహరివంశము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఉత్తరహరివంశము


దనుజేంద్రారివరావరోధదయితాధమ్మిల్లమాల్యంబులున్
గినుకం దెచ్చి ఘటింపఁజూచు జయలక్ష్మీనిత్యనైపథ్యమున్.

16


వ.

ఇట్లు వర్తించి వర్తించి దిగ్విజయంబు సేయు తలంపున.

17

నరకాసురుఁడు స్వర్గముమీఁద దండయాత్ర వెడలుట

సీ.

ఒకనాఁడు దనుజనాయకుసేన[1]తో దివ్య
                 ధామంబుపై కటు దాడి వెట్టి
వజ్రిమందిరము కవాటంబుఁ దనవింటి
                 కొప్పునఁ బొడుచుచుఁ గ్రూరసింహ
నాదుఁడై సమరంబు నా కిమ్ము చాలవేన్
                 జయ మిమ్మనుడుఁ బాకశాసనుండు
నైరావతం బెక్కి యమరసైన్యంబుతో
                 నగరంబు వెలి కేఁగి మగతనంబు


తే.

మిగులఁ దద్దైత్యవాహినిమీఁద నడచె
నప్పు డుభయబలంబులు నసికుఠార
కుంతతోమరక్షురికాదిఘోరశస్త్ర
ఘట్టనంబున నసమసంగరము సేయ.

18


గీ.

అచలగతి నుండె దనుజసైన్యంబు మిగులఁ
బరఁగి [2]దైవసైన్యంబుచేఁ దెరల దయ్యె
దనుజసింహనాదములు డెందములు సొరఁగ
దిరుగఁబడఁ జొచ్చె నమరకుంజరబలంబు.

19


క.

అట్టియెడన్ [3]సురబల మి
ట్టట్టు వడం జేసి దనుజు లసిముసలగదా
ఘట్టనముల బలర్దమను
కట్టెదురన [4]నెఱపి రసమకౌతుకమతులై.

20
  1. గూడి దివ్యపురంబుపై దాడి వచ్చి యేచి
  2. నమరుద్గణంబు
  3. సురబలముల నట్టిట్టు వడంగఁజేసి యసి
  4. పఱపి