పుట:ఉత్తరహరివంశము.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

257


ఉ.

పంచవరప్రదానమున భరుఁడు బాణకృతప్రమోదుఁడై
సంచితనూత్నపారిషదసౌరసమూహకృతస్తవక్రియో
దంచితకీర్తిపూరితదిగంతరుఁ డై నికటప్రవర్తన
క్రౌంచమహిధ్రవైరి గిరిరాజసుతాభజనాతిమోదుఁ డై.

237


వ.

అంతర్ధానంబు చేసె నంతట.

238

శ్రీకృష్ణుఁ డనిరుద్ధుని విడిపించుకొని పోవుట

చ.

గరుడని నెక్కి కేశవుఁడు గ్రక్కున బాణ[1]గృహంబు చేరఁగా
నరిగినఁ బక్షిరాజుఁ గని యచ్యుతపౌత్త్రునిఁ జుట్టికొన్న య
య్యురగము లెల్ల నల్ దెసల నూడనిఁ బాడినఁ జూచి సంతత
స్ఫురితసుఖాతికంటకితసుస్థిరమానసుఁడై ప్రియంబునన్.

239


క.

అనిరుద్ధు మేను దనచే
తను నిమిరె మురాంతకుండు దర్పవిరాజ
దనుజవినాశనపటుతర
సునిశితచక్రాయుధాతిశోభితకరుఁ డై.

240


మ.

అనిరుద్ధుండుఁ బితామహస్తుతివచోవ్యాపారపారీణుఁ డై
తనుఁ బక్షీంద్రుని నెక్కు మన్న నతఁడున్ దై త్యేంద్రకన్యాసఖుల్
దనతోఁ గూడ సుపర్ణు నెక్కఁ బిదపన్ దామోదరుం డెక్క నా
యన యేఁగె న్వివిధప్రచారముల నత్యాశ్చర్యయానంబునన్.

241


క.

గరుడఁడు నడువఁగ దూరము
జరగి హరియు సలిలపాలుసన్నిధి బాణా
సురగోగణములయునికియు
స్థిరముగ విని యతనిదిక్కు చేరుతలఁపునన్.

242


వ.

సుపర్ణున కిట్లనియె.

243
  1. గృహాంతరంబుకై, యరిగినఁ