పుట:ఉత్తరహరివంశము.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

231


న్నాహం బాయుధహీనతం దెలుప విన్నాణంబు గైకోలుగా
నూహింపం గదిసెన్ హరిజ్వరముపై నుగ్రజ్వరం బుధ్ధతిన్.

100


గీ.

అటు గదిసి మూఁడు చేతుల నడిచి మగుడ
నతఁడు వేసిన వాపోపు నవసరమున
మదనరిపుబంటం మందులమారి మఱియు
విష్ణుకింకరు వెజ్జును వీపు గఱచె.

101


శా.

వ్రేటుంబోటును గాటు నిత్తెఱఁగునన్ వేమారు సైరించి వీ
రాటోపంబున వైష్ణవామయవిభుం డాకోపతాపాధిపుం
ద్రాటం బెబ్బులిఁ గట్టిన ట్లొకట దోర్దండద్వయిం జుట్టి మో
మోటం బించుక లేక తక్కిన భుజాయుగ్నంబునన్ వ్రేయుచున్.

102


క.

రాఁ దిగుచు నెగుచు నగుచుం
బోఁ దట్టుం బట్టుఁ దిట్టుఁ బొరిఁ బొరి రోఁదున్
మోఁదు మెడ ద్రొక్కు నెక్కును
మీఁదికి నెగయించు వంచు మెయి సారించున్.

103


గీ.

ఎంత చేసిన నంతంత కెక్కుడయిన
బలము జలమును జూప శాంభవరుజావ
రుండు రుక్మిణీవరుజ్వర[1]రోగరాజు
భుజము లుధ్ధతిఁ బుతపుతఁ బోవఁ గఱచి.

104


వ.

విడిపించుకొని మగుడం దలపడి కేశవరుగ్వల్లభునకు.

105


క.

తలఁ దలతోఁ దాఁకించినఁ
దలమీఱుం గాలు గాలఁ దాఁకించిన మి
క్కిలి కాలు గలుగుఁ జేతులఁ
గులికినఁ దనచేయి మీఁ దగున్ వ్రేటునకున్.

106


ఉ.

హత్తినచోట నేడుదలలౌ [2]నలువాయిఁ బెనంగ వ్రేయుచో
నెత్తినఁ జేతులేడును బయిం మెడగానఁగ వచ్చు మెచ్చుగా

  1. రోగరాజ, భుజగభుజములు పురపురఁ బోవఁ గఱచి
  2. ననువాయి