పుట:ఉత్తరహరివంశము.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

229


గీ.

బాహు వెత్తి చల్లనఁ బరిఢవించి
దేవదేవుఁడు పలుకు నత్తెవులుఱేనిఁ
దఱమి నీ శక్తి యెంత యంతయును నేఁడు
నెఱపుమీ యని గర్వంబు నింగి ముట్ట.

85


క.

ఆ మాటలు విని రోగ
గ్రామణి గోపించి కుడికరంబుల రెంటన్
దామోదరు నురముపయిన్
వేమఱు మిడుఁగుఱులతోడి వెలిమిడి చల్లెన్.

86


వ.

ఇట్లు చల్లుటయును.

87


ఉ.

మంజ్వభిరామజైత్రమగు మాధవుగాత్రము దైన్యపాత్రమై
సంజ్వర మొందఁగన్ ధర వెసం దనచేతులు మూఁడు నెత్తి వ్రే
సెం జ్వరుఁ డంతఁ బోక తులసీవనమాలిక పచ్చగంద మం
టం జ్వలనంబు రాఁ బిడికిటం బొడిచెం దదురఃకవాటమున్.

88


వ.

ఇట్లు వ్రేటునుం బోటునుం జూపి మఱియును.

89


చ.

అదరులు వాఱ నూఁదికొని హస్తయుగంబునఁ గంసవైరిఁ గ
ట్టెదురు నురంబు వ్రేసి పెరయీఁగగతిం గఱచె న్మురాంతకుం
డది చిఱునవ్వునం దెగడి యానముం జదియంగ మోఁదినన్
బెదరక వ్రేటుపాటు నెడపెట్టి గదంబు మదంబు చూపఁగన్.

90


శా.

దైతేయారి ఘనంబు గర్జిలి భుజాదండోహతిం జూపి య
త్యాతంకం బగు రౌద్రతాపమును మూర్ధాధిక్యతన్ ముష్టిని
ర్ఘాతవ్రాతము వైచి నొంచె [1]నిటు ప్రారంభించె ఘోరాభిసం
పాతం బష్టభుజత్రిబాహుల కపూర్వస్తోత్రపాత్రంబుగన్.

91


గీ.

పురుషసింహంబు లిమ్మెయిఁ బోరి ముష్టి
ఘట్టనంబుల నదలించు దట్టనలకు

  1. నటనప్రారంభఘోరాజిసం, వ్రాతంబైన భుజత్రిబాహుల