పుట:ఉత్తరహరివంశము.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

197


క.

కలగన్న చందమో మది
కలఁగుటయో యైంద్రజాలికవినోదంబో
తెలియఁగ నేర నటంచును
దలఁచును నిజమైన నేన ధన్యుఁడ ననుచున్.

207


క.

నాకనకప్రాసాదము
నాకొలువువిలాసినులును నాచుట్టములున్
లేకున్న నేమి కౌఁగిట
నీకామిని యున్నఁ జాలు నెల్లచవులకున్.

208


వ.

అనుచు నయ్యనిరుద్ధుండు నిద్దురలేమి నక్కామినిపొందు నిక్కంబుగా
దెలిసి.

209


సీ

తెమలించి కురులొయ్యఁ దివియ [1]లే కట మున్న
                 కదిసినకెమ్మోవి గమిచి కమిచి
[2]వెడవెడ సోఁకి పై నడర లే కటమున్న
                 యలవడ్డకౌఁగిట నదిమి యదిమి
వలు వెడలింపఁ [3]జే వాటు లే కటమున్న
                 పైకొన్న జఘనంబుఁ బ్రాఁకి ప్రాఁకి
తమకించి కొసరుపంతంబు లే కటమున్న
                 [4]కదిసినచిత్తంబు గరఁచి కరఁచి


తే.

తుది మొదలికంటెఁ దుదికంటె మొదలు చాలఁ
జవులగను లయినరతులకు జనవు లిచ్చి
పూవిలుతుచేతిజంత్రంపుబొమ్మఁ జేసె
మానినీతిలకంబుఁ గుమారవరుఁడు.

210


వ.

ఇవ్విధంబున మదనకేళిం దేలి యక్కులపాలికాతిలకంబు చేతం గల
లోపలం గన్నది మొదలుగాఁ గౌఁగిటిలోనున్నది తుదిగాఁ దనవృత్తాంతం బంతయు
విని యనిరుద్ధు డుషాసౌభాగ్యానిరుద్ధుం డయి కొన్నదినంబు లొరు లెఱుంగకుండ
వర్తించునెడ నొకనాఁడు.

211
  1. క యటమున్న
  2. వెడ సోఁకినంత మై
  3. బైవాటు
  4. కరఁగిన