పుట:ఉత్తరహరివంశము.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

ఉత్తరహరివంశము


లలనారత్నముఁ బార్వతివరవచోలబ్ధాత్మకుండై యొకం
డలయించెం గలలోన మానసగృహైకాకారుఁ డై వేడుకన్.

170


క.

వాఁ డెవ్వఁడో యెఱుంగదు
పోడిమి చెడ లజ్జ గోలుపుచ్చె ననుచుఁ బూఁ
బోఁడి వగచునెఁడఁ జెప్పితి
వేఁడి[1]కొనన్ మగఁడు నీకు వీఁ డని పిదపన్.

171


క.

వరునిపొడ[2]పొ ట్టెఱుంగక
విరహానలశిఖలచేత వేఁగెడు చెలికి
న్వెరవారఁ జిత్రపటమున
సుర వర పన్నగుల వ్రాసి చూపితి నంతన్.

172


వ.

అందులోన.

173


క.

అనిరుద్ధునిఁ జేపట్టెను
మును గలలోఁ గన్నరూపమునకుం జో డై
యునికిఁ దెలసి యాతనిపయి
మనోజరాగంబు మిగుల మరగించుటయున్.

174


మ.

పరితాపంబునఁ బొందు నప్పొలఁతికిం బంతంబు నే నిచ్చితిం
దరుణీ! తెచ్చెద నీమనోరమణుఁ జింతాధార మిం తేల యం
చు రహస్యంబుగ నిక్కుమారవరుఁ గొంచుంబోవ నా త్రోవఁ గా
నరు తక్కెవ్వరు శౌరికిం బిదపఁ గానం జేయుమీ సంయమీ!

175


వ.

అత్తెఱం గేల యను తలంపు గలదేని నవధరింపుము.

176


ఉ.

బాలుఁ డితండు మార్కొనిన బాణుఁడు గెల్చు మురారియైన నా
భీలభుజుండు దద్దనుజు భీమబలుం బరిమార్చునంతలో
నా లలితాంగి నిర్భయవిహారములం జరియించు వాని హృ
చ్ఛూలముగాక యున్నె మనుజుండుఁ దనూజయుఁ గేలి సల్పఁగన్.

177


వ.

కావున నవశ్యంబు యుద్ధంబు సిద్ధంబు.

178
  1. కొనిక
  2. మ ట్టె