పుట:ఉత్తరహరివంశము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

ఉత్తరహరివంశము


భాండుఁడు మంత్రివర్యుఁ డసురాధిపు నత్తఱిఁ జూచి నేఁడు నీ
వొండొకచందమై మిగుల నుబ్బెదు వచ్చినమేలు చెప్పుమా.

23


సీ.

సహజవిగ్రహుడైన శార్ఙ్గిచే మెఱుఁగెక్కు
                 చక్రంబు ముద్దగాఁ జఱచి తొక్కొ
పాతాళగత మైనబంధుదానవకోటిఁ
                 బాటించి తలచూపఁ బంచి తొక్కొ
నీయింటివాకిట నీలలోహితుకంటే
                 గుహునికంటె [1]ఘనుండు గొలిచె నొక్కొ
మీ తండ్రిచే గుజ్జుమెణకరి గొన్న భూ
                 గగనంబు లేలంగఁ గలిగె నొక్కొ


తే.

లవణసాగరమధ్యంబు లావుతోడ
నేలునప్పుడు మన కెల్ల నింత బంటి
న న్నెఱుఁగనీక నీకు నేఁ డున్నయునికి
సబ్బె నెబ్భంగి నిబ్బర మయినయబ్బు.

24


వ.

అనుటయు నద్దనుజుం డమాత్యున కిట్లనియె.

25


చ.

[2]ఇనసమతేజ వింటివె యతీవభుజక్రమవిక్రమక్రియా
ఘను లగుపోటుబంటులకు గాఢతరప్రతిపక్షవక్షభం
జనహృదయైకరంజనవిశాలమహాహవమూల మైనయ
య్యనిమొనఁ గాక కల్గునె సమంచితకీర్తియు ధైర్యమూర్తియున్.

26


ఉ.

లావున వైరిదర్పము వెలార్పక [3]యేఁకరి యున్న చేతులన్
భావభవారిపాదములు పట్టి పరాక్రమకేళిఁ గోరితిన్
డేవునదుండి యన్నెమిలిటెక్కెము గూలినయప్డు సంగరం
బేవల నైనఁ గల్గు ననియెన్ హరుఁ డొండొక మోద మేటికిన్.

27


వ.

అని మఱియును.

28


చ.

నెయ్యము లేనిసంగతియు నిక్కము లేనివచోవిలాసమున్
వియ్యము లేనివైభవము విందులసందడి లేనిముంగిలిం

  1. ను ఘనుఁ గొలిచి తొక్కొ
  2. ఈ పద్యము ప్రాచ్యలిఖితపుస్తకశాలలోని ప్రతిలో మాత్ర మున్నది.
  3. యాకలిగొన్న