పుట:ఉత్తరహరివంశము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఉత్తరహరివంశము


గీ.

అప్పు డాహంసడిభకు లిట్లనిరి మనకు
లవణ మెంతేని నడుగు యాదవులచేత
వేగ రమ్మను శౌరి నియ్యాగమునకు
నావుడుం బని పూనితి దేవదేవ!

152


వ.

అనుటయు వాసుదేవుండు రోసంబునకు మూలం బైన హాసంబు చేసి
యిట్లనియె.

153


ఆ.

రాజసూయకర్త బ్రహ్మదత్తుం డట్టె!
[1]రభస మెసఁగ హంసడిభకు లట్టె!
చేయఁ బంచువారు చెల్లఁబో లవణంబు
మోచువాఁడ కాక మురవిరోధి.

154


ఉ.

అప్పన మెంత గావలె నహంకరణంబు దొఱంగి యిచ్చినం
గప్పముపేర నేఁడు నొడికారితనంబున మోసపుచ్చఁగా
నుప్పులు దెత్తురే సమరయోగ్యతలంబున వైరికోటితో
నుప్పనఁబట్టె లాడునెడ నుప్పులు దెత్తురుగాక యాదవుల్.

155


వ.

అని పలికి యాదవలోకంబు నాలోకించి.

156


మ.

కలరా యింతకుమున్ను యాదవులచేఁ గప్పంబు దెప్పింపఁగాఁ
గలరా రాజులు గాజులుం దొడవుఁగా గల్పించిరా కాకులం
గలకంఠంబులఁ జేసెనా కటకటా! గౌరీశ్వరుం డేమిగాఁ
గలవారో యిటమీఁద హంసడిభకుల్ గర్వాంధకారంబునన్.

157


వ.

అనుటయు యాదవులు దమలోన.

158


గీ.

హంసడిభకులు రాజసూయంబు సేయ
మనము గప్పంబుఁ గొనిపోక మంచిమాట
నేఁడు [2]సారిసత్తెలమొనల్ వాఁడి చేసి
నోరి చొరవ భూతేశుండు వారిఁ జెఱిచె.

159


ఉ.

యాదవు లుప్పు మోవఁగ మురారికి సోలలు మోవ కింకఁ బో
రాదు హలాయుధుం గొలువ రమ్మను రై రటుగాని యాగముం

  1. రచన౼డిచకులట్టి (వీ)
  2. సారెసత్తుల