పుట:ఉత్తరహరివంశము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ఉత్తరహరివంశము


చ.

అనుటయు హంసుఁ డిట్లను జనార్దనుతో ముదిజోదు భీష్ము నొం
డనఁ బనిలేదు బాహ్లికుఁడు నాతనికంటెను బంకు వీరు మ
ద్ఘనభుజశక్తికిం దరము గారు దలంపక వచ్చి భీముఁడుం
గనుఁగొన లేఁడు మద్ధనురకాండరవిచ్ఛవిచండకాండముల్.

131


మ.

కలు ద్రావం బని పూని యాదవులు ఖడ్గాఖడ్గి [1]వాదింతురే
కలఁగం బాఱుట గాక పంతములకుం గంసారి సైరించినం
గలనం బ్రాణముతోన పట్టువడు నింకన్ సాత్యకిం గీత్యకిన్
బలభద్రున్ గిలభద్రు నాయెదురఁ జెప్పం జొప్పు దప్పుం జుమీ.

132


క.

మనకు జరాసంధునకును
మనసులు గలసినవి ధర్మమయుఁ డాతం డీ
పని గాదనఁ డింక జనా
ర్దన యాదవనగరమునకుఁ దడయక చనుమీ.

133

హంసడిభకులు జనార్దనుని యాదవనగరమునకుఁ బంచుట

క.

చని యా జనార్దనునిచే
ఘన మగులవణంబు మనకుఁ గప్ప మడుగు మే
ధనములును సరకు గా విటఁ
జనుదెమ్మను మతని యజ్ఞసమయంబునకున్.

134


క.

ఏయుత్తరంబు సెప్పిన
నీయానయ నీకుఁ జెలిమి నీతో మిగులం
జేయుట నొండన నేర న
సూయ తలంపునకు రాదు సూ నినుఁ గనినన్.

135


మ.

అనుడు న్వేడుకతోడ వీడుకొని యశ్వారూఢుఁడై యా జనా
ర్దనుఁ డేతేరఁ దదంతరంగము [2]మునీంద్రత్రాణు శ్రీవత్సలాం
ఛను నేఁడెల్లి కనుంగొనం గలిగినం జోలుం గృతార్థుండఁ బొ
మ్మని చింతింపఁగ నాకు నేఁడొదవె నాహా తీర్థమున్ స్వార్థమున్.

136
  1. ఁబాటింతురే
  2. విచారంబార