పుట:ఉత్తరహరివంశము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

123


చ.

మఱకువఁ గత్తరించి మదమానములం [1]జుఱవుచ్చి మెచ్చుఁ జాఁ
గఱగొని క్రోధకామముల గండడగించి పరోపకారమున్
జఱఁ బడఁ ద్రోచి వాచవులచట్టలు వాపి తొలంగి చిత్తముం
జఱపడి యున్న నీకు నొక చక్కటి నెక్కటి వేడగల్గెనే.

87


గీ.

కలుగుటకు మీరు విచ్చేయు కారణమున
సందియము లేదు మీయట్టి సంయములకు
నేమి కార్యంబు గలిగెనో యెరుఁగ రాదు
తెలుపవే నాకు నిర్మలధీనిధాన.

88


క.

అనుటయు భగభగ మండెడు
కనుఁగవతో నొడల నడరుకంపముతో నె
ట్టిన నిట్టూర్పులతో మొగ
మునఁ దనికిన కెంపుతోడ మునిపతి యుండెన్.

89


వ.

తదనంతరంబ యంతరంగంబు కొంత సంతరించికొని యతండు నారాయణున
కిట్లనియె.

90

దుర్వాసుఁడు హంసడిభకుల దుర్నయంబు కృష్ణున కెఱిఁగించుట

మ.

తగునే యింత మురాంతకా తలఁపవే త్రైలోక్యముం గావ నీ
వు గదా దానవవైరివై పొడమి లావుం జేవయుం జూప రూ
పగుదైవంబు గదాధరుండ వఖిలవ్యాపారపారంగమా
ధ్వగ మావృత్త మెరుంగనేర వనఁ జిత్తం బుత్తలం బందదే.

91


శా.

ఏఁ గాదే నడ[2]తుం జతుర్ముఖునితో నింద్రాదిదిక్పాలకుల్
మూఁగంబాఱి భవత్పదాబ్జములకున్ మ్రొక్కంగ లేకున్నచో
నాఁగ న్వచ్చియు నాఁగఁ జాలని ప్రతీహారు న్విడంబించుచున్
దాఁగం బోయి తలారివానియెదురన్ దాఁగంగ నీ కేటికిన్.

92


ఉ.

ప్రాతల మేము నీకుఁ బలుబాములఁ బొందకి యున్ననాఁటి[3]నీ
చేతలు గంటి [4]మిందఱకుఁ జిత్తముల న్వెలిఁ దోఁచుసూఁత[5]లం

  1. జుఱువుచ్చి
  2. నం
  3. విచ్చేఁతలు
  4. మింతటికి
  5. లు