పుట:ఉత్తరహరివంశము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ఉత్తరహరివంశము


క.

నావుడు దుగుణము సూ యిది
తీవంచన [1]యోడెఁ దప్పితే సరి యే యే
మీ వెఱవకు మన[2]రొ ప్రజం
బోవుఁ జుమీ పలకవ్రాయి పొదపొదఁ డనినన్.

139


వ.

వార లన్నారాయణదేవుండు నెత్తంబు తమకంబునం దత్తఱంపు
నొడువులఁ గలయం దమకు నుత్తరం బిచ్చిన పలుకులం బురుషోత్తముని చిత్తంబు
దమమీఁద లేదని విచారించి విన్నపం బవధారు దేవా యనుటయు నయ్యదు
కులాంబుధిసుధాకరుండు సకలకళాకుశలుండు గావున నత్తఱి సత్యభామ
పాసికలు దాలించి వైచిన.

140


గీ.

దాయ మెత్తనో యీసారే దాఁక నీక
కట్టి గెలిచెద నిదే పాసి కల[3]నిదయ్య
ముల బటాబూర మిందేమి ముట్టఁ గలదొ
పొంది వచ్చిన వ్రాలకుఁ బోవుఁ గాక.

141


క.

నావుడు సంతోషించిరి
సావాసులు వీరవచనచతురత సత్యా
దేవియు నెత్తవుమాటలు
గా విని తెలిసికొని మెచ్చెఁ గంసారాతిన్.

142

శ్రీకృష్ణుఁడు కృత్యపైఁ జక్రముఁ బంపుట

మ.

మతి నొక్కింతయు సంచలింపక నిలింపత్రాణపారీణుఁ డ
చ్యుతుఁ డాకృత్య కకృత్యకారిణికి ప్రాప్తిగాఁ బంచె ని
ర్గతబాష్పోదకదానధారరిపురాట్కాసార[4]విస్తారసం
తతపూరస్థిరమానమీనహరణాంతర్నక్రముం జక్రమున్.

143


వ.

అదియును శతకోటిశతకోటిసన్నిభంబై చిత్రభానుచిత్రభానుభావం
బై సహస్రకిరణసహస్రకిరణనిపుణం బై సహస్రారుణమండలమధ్యదేవతా
వివిధాయుధవిహరణవిద్యుల్లతికావిలాసం బై జపాక్షనిక్షప్తరక్షారక్షణం

  1. యొడ్డిత
  2. రోపో
  3. నువచ్చి పట్టెవో భూత మిందేమి పుట్టఁగలదొ
  4. ధీసార