పుట:ఉత్తరహరివంశము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ఉత్తరహరివంశము


రావములతోడఁ జూడఁగ
దీవన వడయంగఁ దూర్పు తెలతెల[1]వాఱెన్.

84


వ.

తదనంతరంబ.

85


సీ.

కుంకు[2]ము హత్తించి కొనగోరఁ దీర్చిన
                 పురుహూతునిల్లాలిబొ ట్టనంగఁ
జక్రవాకములకుఁ బల్లఁగా మందు ద్రా
                 గించిన చెందపుగిన్నె యనఁగఁ
బార్వతీపతికిఁ బ్రభాతభూపతి గొన్న
                 యలరుగెందమ్మికోహళి యనంగఁ
తొలిదిక్కుతొయ్యలి చెలులపైఁ జల్లంగ
                 నిండ ముంచినపైడిఁకుండ యనఁగ


తే.

మేరుధరణిధరంబుతో మేలమాడ
నుదయగిరిరాజు దలయెత్తెనో యనంగఁ
గ్రమముతో నించుకించక గాన నగుచు
భానుబింబంబు గన్నులపండు వయ్యె.

86

శ్రీకృష్ణుఁడు ద్వారకానగరమున కేతెంచుట

ఉ.

అంత మురాంతకున్ బదరికాశ్రమవాసులు వీడుకొన్న ని
శ్చింతుఁ డతండు పత్త్రరథసింహము నెక్కి విమానపంక్తు లం
తంతఁ దొలంగ వచ్చి నగరాంతికసంగరసంభ్రమారవం
బెంతయు దవ్వులం జెవుల నించుక సోఁకిన సంశయించుచున్.

87


తే.

హలధరునియార్పు సాత్యకి యార్భటియును
బ్రతిభటనినాదముల దాఁటి పరఁగుటయును
దెలిసి కంసారి సంగరోద్రేకఘూర్ణ
మాననయనుఁడై యిట్లని మదిఁ దలంచు.

88


చ.

కటకట పుండ్రనందనుఁడు [3]కన్నులఁ గానక వచ్చి వీటిపై
నిటు విడియంగఁ జాలెనట యింకిట యాదవకోటి కేటికిం

  1. నేగెన్
  2. కన్నులు