పుట:ఉత్తరహరివంశము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

69


మ.

దనుజేంద్రుండు తపఃప్రభావమున నత్యంతస్థిరస్వాంతుఁ డై
నను మెప్పించి వరంబు వేఁడెఁ దన కెన్నండున్ వినాశంబు లే
క నికామవ్యవహారుఁ డై తిరుగ నౌఁగా కంటి నేనుం ద్రిలో
చనసూనుం డొకరుండుదప్పఁ జెఱుపన్ శక్తుండు గాఁ డెవ్వఁడున్.

188


క.

అని వానివరములోనన
మునుముట్టఁగఁ గొంత నెగులు మోవఁ బలికినన్
విని దనుజుఁడు మీ దెఱుఁగక
చనియె జితేంద్రియుల కేటిసంతతి యనుచున్.

189


చ.

అమరపతీపతివ్రతల కాదిమదైవతమైన పార్వతిం
బ్రమథవిభుండు గైకొనెఁ గృపాపరతన్ బరీచర్య సేయ నీ
సమయమునందు మన్మథుఁడు సాగి శరాసనకౌశలంబునన్
హిమగిరిరాజకన్యపయి నీశునిచిత్తముఁ జేర్ప నోపినన్.

190


క.

ఆరమణికి నుదయించుకు
మారుఁడు సేనాని యగు నమర్త్యులు వొగడన్
దారకుని నెల్చి తిరముగ
నీరాజ్యము నిలుప నోపు నిక్కం బనుడున్.

191


శా.

జంభారాతి విజృంభమాణహృదయోత్సాహైకసాహాయ్యుఁడై
యంభోజాసనుపంపునన్ జని ప్రసూనాస్త్రున్ దలంచె న్నటా
[1]రంభస్తంభనదంభఖేదవిహరద్రంభాపరీరంభణ
స్తంభాసంభవగుంభరత్నరచనాస్థాన[2]స్థలస్థేముఁడై.

192


వ.

ఆలోన.

193


సీ.

మకరంద మాని మైమఱచిన గొనయంబు
                 వెడమ్రోయఁ గడివోనివింటితోడ
జలజకేసరరాజి జల్లెడమూఁకగా
                 దాఁటుపఠారిరథ్యములతోడఁ
గర్ణికారపుమొగ్గ కనకంబుగుబ్బగాఁ
                 గోయిల నోరూరుగొడుగుతోడ

  1. రంభస్తంభనిశుంభఖేదవిచరద్రం. (వి)
  2. స్థితి