పుట:ఉత్తరహరివంశము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

ఉత్తరహరివంశము


నుదయాద్రితటము[1]తో నుద్దించునురమునఁ
                 గౌస్తుభం బనుదివాకరుఁడు దోఁప
నాకలోకంబు[2]తో నవ్వుపాదంబున
                 నాకాశనది యనునమృత మొప్ప


తే.

నమృతధారాధరము మాటలాడినట్లు
భాగ్యదేవత రూపు చేపట్టినట్లు
లలితగతి నున్న సద్గుణాలంకరిష్టు
విష్ణుఁ బొడగంటి భవముల వీడుకొంటి.

146


వ.

అనుచుం ప్రణామంబు చేసి.

147


క.

పకపక నవ్వుచు నొకవి
ప్రుకళేబరమాంస మెల్లఁ బుచ్చి పునుకపా
త్రిక లోనఁ గడిగి పెట్టుచు
నకుటిలమతిఁ గృష్ణ! 'నీకు నర్పిత' మనుచున్.

148


గీ.

ఆరగింపవె దేవ! మాయందు విందు
వేలు పన్నఁ బాటింతురు విప్రమాంస
మిచట మత్ప్రీతిసేసి న న్నేలికొనుము
భక్తి గాని నీ కేమియు బ్రాఁతి గాదు.

149


క.

నావుడు మురారి నవ్వుచు
నావేఁదుఱు నూఱడించి యనుచితము మహీ
దేవునిఁ జంపుట యనుచుం
గైవెక్కినవానిమేను కరమున నిమిరెన్.

150


వ.

నిమురుటయును.

151


క.

తామరరేకులఁగన్నులు
సామజహస్తములు దొడలు శశిమండలమున్
మోమును మెఱుపును నొడలును
సోమింపఁగ దివ్వరూపసుందరుఁ డయ్యెన్.

152
  1. న నుద్దించు
  2. ను నవ్వు