పుట:ఉత్తరహరివంశము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

59


గీ.

నీపు నీపోవుదెసఁ బొమ్ము నీకు మాకు
మాట లేటికి ననుచు నమ్మరులుఱేడు
నచటఁ బ్రేవులు దర్భలు నాసనంబు
చేసి తనమానసంబునఁ జేర్చెఁ గృష్ణు.

141


క.

తలఁపునఁ జూచినరూపును
వెలిఁజూచినరూపు నొక్కవిధ మయి యున్నన్
నెలకొని ఘంటాకర్ణుఁడు
నలినాక్షుని నామకీర్తనం బొనరించెన్.

142


వ.

 అద్దేవుని నుతియించు నప్పుడు.

143


సీ.

తొమ్మండ్రుగొడుకులఁ దొలివేలుపులఁ జేయుఁ
                 బొడమించు నేదేవు బొడ్డుఁదమ్మి
మూఁడుత్రోవలఁ బాటి మున్నీటిగరిత గాఁ
                 బరఁగు నేదేవునిపాదతటిని
పండ్రెండురూపులై పగలింటి రాజు గా
                 వలఁతి యేదేవుని [1]వలనుఁగన్ను
వేయిమానికపుదివ్వెలతోడఁ బడగలు
                 మ్రాల్చు నేదేవునిమలకపాన్పు


గీ.

మునులకెల్ల నేదేవునిమూర్తి వెలుఁగు
హృదయగేహంబులో దీప మెత్తి నట్లు
హరి మురారి నద్దేవు మహానుభావు
మనసులోఁ గంటి భవములు మాను నంటి.

144


వ.

అనుచు విలోచనంబులు దెఱచి చూచి.

145


సీ.

పుండరీక[2]ములతోఁ బురణించుకన్నులఁ
                 గారుణ్య మనుతేనె గడలుకొనఁగఁ
మందారశాఖతో మలయఁ జాలెడు కేల
                 బాంచజన్యం బనుపండు మెఱయ

  1. వలనికన్ను(లీ)
  2. మ్ములం