పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దస్తావేజులోని విషయములను గూర్చి వాగ్రూపమైన ఒప్పుకోళ్ళు ఎప్పుడు సంబద్దములు.

22. దస్తావేజులొని విషయములను గూర్చి వాగ్రూపమైన ఒప్పుకోళ్లను రుజువు చేయ ఫూనుకొను పక్షకారుడు ఇందు ఇటు పిమ్మటగల నియమముల క్రింద ఆట్టి దస్తావేజులొని విషయములకు ద్వితీయక సాక్టమును ఇచ్చుటకు తనకు హక్కు కలదని చూపిననే తప్ప మరియు అంతవరకు లేక దాఖలు చేయబడిన దస్తావేజు కూట రచితమా కాదా అనునది ప్రశ్నగతమైనదే తప్ప ఆ వ్యాగ్రూపమెన ఒప్పుకోళ్లు సంబద్దములు కావు.

సివిలు కేసులలొ ఒప్పుకోళ్ళు ఎప్పుడు సంబద్దములు.

23. ఒక ఒప్పుకొలు, దానిని గూర్చి సాక్షము ఈయకూడదను అభిన్నకమైన షరతుపై గాని దానిని, గూర్చి సాక్ష్యము 'ఈయకూడదని పక్ష కారులు పరస్పరము అంగీకరంచినట్లు న్యాయస్తానము ఊహించదగిన పరిస్థితులలో గాని, చేయబడినచో, సివిలు కేసులతో ఆ ఒప్పుకొలు సంబద్దమై నది కాదు.

విశదీకరణము:-- ఈ పరిచ్చేదము లోని దేదియు. ఎవరేని బారిస్టరును, ప్లీడరును, అటార్నీని లేక వకీలును అతడు 126వ పరిచ్చేదము క్రింద తప్పనిసరిగా సాక్షము ఈయవలపిన ఏదేని విషయమును గూర్చి సాక్షము ఇచ్చుటనుండి తప్పుకొననిచ్చునదిగ భావింపబడరాదు.

ప్రేరేపణ, బెదరింపు లేక వాగ్దానము వలన చేయబడిన నేరపు ఒప్పుకోలు ఎప్పుడు క్రిమినలు చర్యలో అసంబద్దము,

24. నేరము మోపబడిన వ్యక్తి పై గల చర్యలకు సంబంధించి ఐహికరూపమైన ఏదేని ఆనుకూల్యమును పొందవచ్చుననిగాని ఏదేని. కీడును తప్పించుకొనవచ్చుననిగాని తాను సహేతుకముగా భావించుటకు ఆధారములు గలవని నేరము మోపబడిన వ్యక్తికి తోచియుండవచ్చునని న్యాయస్థానము అభిప్రాయ పడునంత ప్రబలమైన ప్రేరేపణ, బెదిరింపు లేక వాగ్ధానము. ప్రాధికారము గల వ్యక్తి నేరారొపణ విషయమున చేసినందున నేరము మోపబడిన వ్యక్తి నేరపు ఒప్పుకోలును. చేసెనని న్యాయస్థానమునకు తోచినచొ, ఆ నేరపు ఒప్పుకోలు క్రిమినలు చర్యలో అసంబద్దమై నదగును

పొలీసు అధికారికి చేసిన నేరపు ఒప్పుకోలును రుజువు చేయరాదు.

25. పోలీసు అధికారికి చేసిన ఏ నేరపు ఒప్పుకోలు నైనను ఏదేని అపరాధము మోపబడిన వ్యక్తికి వ్యతిరేకముగ రుజువు చేయరాదు.

నిందితుడు పొలీసు అభిరక్టయందున్నప్పుడు చేసిన నేరపు ఒప్పుకోలును అతనికి వ్యతిరేకముగా రుజువు చేయరాదు.

26. పోలీసు అధికారి యొక్క అభిరక్ష యందున్నపుడు ఏ వ్యక్తియై నను చేసిన ఏ నేరపు ఒప్పుకోలు నైనను, ఒక మేజి స్ప్రేటు యొక్క సన్మిహిత సమక్షమున చేయబడిననేతప్ప, అట్టి వ్యక్తికి వ్యతిరేకముగ రుజువు చేయరాదు.

విశదీకరణము:--- ఫోర్టు సెంటు జార్జి ప్రెసిడెన్సీలోగాని మరొకచోటగాని, మేజిస్ట్రేటు కృత్యములను నిర్వహించుచున్న గ్రామపెద్ద క్రిమినలు ప్రక్రియా స్మృతి 1882 క్రింది మేజిస్ట్రేటు అధికారములము వినియోగించుచున్న మేజిస్ట్రేటు అయిననేతప్ప, ఈ పరిచ్చేదములోని “మేజిస్ట్రేటు” అను పద పరిధియందు చేరడు.

నిందితుని నుండి పొందిన సమాచారములో ఎంత భాగమును రుజువు చేయవచ్చును.

27. అయితే ఏదేని అపరాధము మోపబడి. పోలీసు అధికారి యొక్క అభిరక్ష యందున్నట్టి వ్యక్తి తెల్పిన సమాచార పరిణామముగా. ఏదేని సంగతిని కనుగొన్నట్ను సాక్ష్యము ఈయ బడినవుడు అట్టు కనుగొనబడిన సంగతికి సుస్పష్టముగ సంబంధించినంత మేరకు అట్టి సమాచారమును, అది నేరపు ఒప్పుకోలు అయినను కాకున్నన్సు రుజువు చేయవచ్చును,

ప్రేరేపణ, బెదరింపు లేక వాగ్దానము ద్వారా కలిగిన మనోభావము తొలగిన పిమ్మట చేయబడిన నేరపు ఒప్పుకొలు సంబద్దము.

28. 24వ పరిచ్చేదములో నిర్దేశింపబడినట్టి నేరపు ఒప్పుకోలు, అట్టి ఏదేని ప్రేరేపణ, బెదిరింపు లేక వాగ్ధానము ద్వారా కలిగింంపబడిన మనొభావము ఫూర్తి గా తొలగిన పిమ్మట చేయబడినదని న్యాయస్థానము అభిప్రాయపడినచొ సంబద్దమైనదగును.

అన్నథా సంబద్దమగు నేరపు ఒపుకోలు రహస్యముగా నుంచుటకు ఇచ్చిన వాగ్ధానము మొదలగు కారణముల వలన అసంబద్దము కాకుండుట.

29. అట్టి నేరపు ఒపుకోలు అన్నథా సంబద్దమైనదగుచో, రహస్యముగా ఉంతుమను వాగ్ధానమును బట్టియైనను నేరము మోపబడిన వ్యక్తిని దానిని రాబట్టుటకై వంచన చేసిన పరిణామముగానై నను అతడు కైపులొ ఉన్నపుడైనను అది చేయబడినదను కారణ మాత్రముననే గాని, ఏ రూపములొ అడుగబడిననైనను అతడు జవాబు చెప్పనక్కర లేని ప్రశ్నలకు జవాబుగా అది చేయబడినదను కారణమాత్రముననేగాని, ఆ నేరమును ఒప్పుకొను అగత్యము ఆతనికి లేదనియు, ఆ విషయమును గూర్చి అతనికి వ్యతిరేక సాక్షముగా ఆ నేరపు ఒప్పుకోలు ఈయబడవచ్చుననియు అతనిని హెచ్చరించలేదను కారణ మాత్రముననేగాని, అది అసంబద్దమైనదగును.

రుజువయిన నేరపు ఒప్పుకోలు చేసిన వ్యక్తిని ఒకే అపరాదమునకు అతనితో సయుక్తముగా విచారణ చేయబడుచున్న ఇతరులను బాధించెయుదైన ఆ ఒప్పుకోలును పర్యాలొచించుట,

30.ఒకరి కంటె ఎక్కువ మంది వ్యక్తులు ఒకే అపరాధమునకు సంయుక్ష్తముగా విచారింపబడుచుండి, అట్టి వ్యక్తులలో ఒకరిచే చేయబడినద్దై, అతనిని అట్టి వ్యక్తులలో ఎవరేని ఇతర వ్యక్తిని బాధించెడుదైన నేరపు ఒప్పుకోలు రుజువు చేయబడినపుడు, ఆట్టి ఇతర వ్యక్షికిని అట్టి నేరపు ఒప్పుకోలు చేసినట్టి వ్యక్షికిని కూడ వ్యతి రేకముగా న్యాయస్థానము, అట్టి నేరపు ఒప్పుకోలును పర్యాలోచనలోనికి తీసికొనవచ్చును.