పుట:ఆముక్తమాల్యద.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భుజంగప్రయాతము.

బలద్విడ్వినిర్దిష్టపాథోధరోరూ
పలాసారధారాతపత్రీకృతాద్రీ
ఫలన్మూర్ధచాణూరభంగోగ్రబాహా
కలాకృత్తకంసా శిఖండావతంసా.

88


మ.

ఇది కర్ణాటధరాధృతిస్థిరభుజాహేవాక లబ్ధేభరా
డుదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీష ర
త్నదృగంచత్పద కృష్ణరాయ వసుధాధ్యక్షోదయముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యముల నాద్యంబై మహింబొల్పగున్.

89

ప్రథమాశ్వాసము సమాప్తము