తే. | దేవదైత్యగణములు దెవు లొసంగు, మనుజరాక్షసగణములు మడియఁజేయు | 240 |
తా. | శ్రవణము, పునర్వసు, స్వాతి, పుష్యమి, ఆశ్విని, రేవతి, హస్త, అనూరాధ, మృగశీర్ష యీ 9 నక్షత్రములు దేవగణములు. జ్యేష్ఠ, విశాఖ, కృత్తిక, శతభిషం, చిత్త, మూల, ధనిష్ఠ, ఆశ్లేష, మఖ, యీ నక్షత్రములు రాక్షసగణములు. ఆర్ద్ర, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర యీ 9 నక్షత్రములు మనుష్యగణము. కాన నిందు దేవరాక్షసగణములు రాక్షసమానవగణములు కూడినయెడలఁ గారాదు. దేవనునుష్యగణములు కూడినను, సమగణములు కూడినను మంచిదని తెలియునది. | |
యోనిపొంతనము
సీ. | అశ్వినిశతతార లవి రెండు నశ్వముల్ స్వాతిహస్తంబు లచ్చపుటెనుములు | |
తే. | బోతు నాతికైన నాతి పోతుకునైనఁ, గలహ మగుచునుండుఁ గాన నెఱిఁగి | 241 |
తా. | ఈచెప్పిననక్షత్రములలో మొదట చెప్పినవన్నియుఁ బురుషులును, వెనుకఁ జెప్పినవన్నియు స్త్రీలునుగా నెంచవలెను. అశ్వమహిషములకు, నేనుఁగుసింగములకు, ముంగిపాములకుఁ, బిల్లియెలుకలకు, వానరములకు గొఱ్ఱెలకు, గోవులకుఁ బులులకు, శునకములకు లేళ్లకు, నన్యోన్యవైరము గనుకఁ దెలిసి యుంచఁగలది. | |
గీ. | హరియు గరియును బులి ధేను వహియు ముంగి | |