పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"ఉ ౡ అం ఙ ఞ ణ న న ళ క్ష”లను నీపదియు నాకాశబీజములు. వీనిఁ బద్యా
ది నునుప నశుభము. కాన సుకవీశ్వరు లగువా రిది విచారించి పద్యముల రచియిం
చునది.

18
ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున:—
[1]సీ.

ఆఇఉఋఌను మఱి యాదీర్ఘవర్ణంబు, లైదు నెకారాదు లైదు నవని
వరుసఁ గవర్గాదివర్గపంచకమును, యాదు లైదును షాదు లైదుఁ గూడ
నొండొంటితోఁ గూర్చి యొనరదొంతిగఁ బేర్చి, మానుగాఁ జూచిన వానిలోనఁ
బ్రథమాక్షరంబులు పవనబీజంబులు, నవలివి దహనబీజాక్షరములు


తే

నవనిబీజంబు లాతృతీయాక్షరములు, వారిబీజంబు లాతఱువాతి లిపులు
గగనబీజంబు లేనవకడలవెల్ల, వానికీడును మేలును వలయుఁ దెలియ.

19


[2]మ.

క్షితిబీజంబులు సంపద ల్పొదలఁ బోషించున్ బయోబీజముల్
సతతంబున్ బ్రమదం బొనర్చు శిఖిబీజంబు ల్మృతిం జేయు మా
రుతబీజంబులు శోకవారిధిఁ బడంద్రోయున్ నభోబీజముల్
పతి నత్యంతదరిద్రుఁ జేయుఁ గృతులన్ బద్యాది నొందించినన్.

20
అనంతచ్ఛందము:—
గీ.

పరగుఁ గవితగద్యపద్యంబులన పాద, కల్పనంబు వలదు గద్యమునకుఁ
బాదనియతి నొప్పుఁ బద్యంబు లవియు వృ, త్తములు జాతులనఁగఁ[3] దనరుఁ గృష్ణ.

21

1.6

యతిప్రాసంబు లుంచు తెఱఁగు

క.

ఎన్నిట యతి రాఁదగునని, రన్నిట సంస్కృతమునను నగు విచ్ఛేదం
బెన్నిట యతి రాఁదగు నని, రన్నిటఁ దెనుఁగునకు మొదటియక్షర మమరున్.

22
సాహిత్యరత్నాకరమున:—

"ఛందోజ్ఞాన మిదం పురా త్రిణయనా ల్లేఖే శుభం నందిరాట్
తస్మా త్ప్రాప సనత్కుమారక తతో౽గస్త్య స్తతో వాక్పతిః,
తస్మా ద్దేవపతి స్తతః ఫణిఫతి సస్యానుజః పింగళ
స్తచ్ఛిష్యై ర్మునిభి ర్మహాత్మభి రిదం భూమౌ ప్రతిష్ఠాపితమ్.”

  1. ఈరెండుపద్యములు కవిసర్పగారుడములోనివని ఇక్కడ స్పష్టముగా ఉన్నది; గాని, వీటినే (కొద్దిగా పాఠభేదములతో) కవిజనాశ్రయములో సైతము చూచినాము (చూ. సంజ్ఞ. 58, 59) నిజముగా ఇవి ఎవరిపద్యములో తెలియదు.
  2. ఈరెండుపద్యములు కవిసర్పగారుడములోనివని ఇక్కడ స్పష్టముగా ఉన్నది; గాని, వీటినే (కొద్దిగా పాఠభేదములతో) కవిజనాశ్రయములో సైతము చూచినాము (చూ. సంజ్ఞ. 58, 59) నిజముగా ఇవి ఎవరిపద్యములో తెలియదు.
  3. నమరు